వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-31T05:05:23+05:30 IST

నాళేశ్వర్‌కు చెందిన బేగరి రాజేశ్వర్‌ (68) అ నే వృద్ధుడు మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై యాకూబ్‌ తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

నవీపేట, డిసెంబరు 30: నాళేశ్వర్‌కు చెందిన బేగరి రాజేశ్వర్‌ (68) అ నే వృద్ధుడు మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడని అ న్నారు. ఇటీవల అతడికి మానసిక స్థితి కూడా బాగా లేదన్నారు. ఇంటి స మీపంలో ఉన్న పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారన్నా రు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

చికిత్స పొందుతూ ఒకరి మృతి..

అభంగపట్నంకు చెందిన మంత సాయన్న (48) అనే వ్యక్తి చికిత్స పొం దుతూ బుధవారం మృతిచెందాడని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. కడుపునొ ప్పి భరించలేక ఈ నెల 21న క్రిమిసంహారక మందు తాగినట్లు చెప్పారు. జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-31T05:05:23+05:30 IST