శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
ABN , First Publish Date - 2020-12-31T05:26:10+05:30 IST
పట్టణంలోని రూరల్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి బుధవారం తనిఖీ చే శారు.

బాన్సువాడ, డిసెంబరు 30: పట్టణంలోని రూరల్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి బుధవారం తనిఖీ చే శారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తు న్నామని ఎస్పీ అన్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో రికార్డులను తనిఖీ చేశారు. పెట్రోలింగ్‌లను ముమ్మ రం చేయాలని, దొంగతనాల నివారణతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎప్పటికప్పుడు వాహనదా రులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపార సము దాయాల వద్ద వ్యాపారస్తులు సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకోవాలన్నారు. ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, రూరల్ సిఐ చంద్రశేఖర్, పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.
పిట్లం: ప్రతీ గ్రామంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డి అన్నా రు. బుధవారం పిట్లం పోలీసు స్టేషన్‌ను పరిశీలిం చారు. రికార్డులను తనిఖీ చేశారు. వ్యాపారస్థులు, గ్రా మస్థులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరా లను నియంత్రించొచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్సై సుదాకర్ ఉన్నారు.