రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-29T05:14:53+05:30 IST

జిల్లావ్యాప్తంగా జాతీయ, రహదారుల వెంట రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీస్‌ శాఖ చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి : ఎస్పీ
రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ శ్వేతారెడ్డి

నిజాంసాగర్‌, డిసెంబరు 28: జిల్లావ్యాప్తంగా జాతీయ, రహదారుల వెంట రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీస్‌ శాఖ చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. సోమవారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ రహదారుల వెంట ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అవగాహన చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో దొంగతనాలు జరుగకుండా జాగ్రత్తలు చే పట్టాలని సూచించారు. రాత్రివేళల్లో గ్రామాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్‌ ని ర్వహించాలని అదేశించినట్లు తెలిపారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట బా న్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి, రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థలాలను పరిశీలించిన ఎస్పీ

మాగి గ్రామ శివారులో నవంబర్‌ 22వ తేదీన ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గుర య్యాయి. చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థలాలను ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం పరిశీలించారు. ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌ను పలు విషయాలను అడిగి తెలు సుకున్నారు. మాగి శివారులోని ఆరు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని ట్రా న్స్‌కో ఏఈ ఎస్పీకి వివరించారు. పోలీసులు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాల విష యంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

Updated Date - 2020-12-29T05:14:53+05:30 IST