నిర్మల్‌ జిల్లాలో కరాటే అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-11-27T05:15:26+05:30 IST

జిల్లాలో కరాటే అభివృద్ధికి కృషి చేస్తామ ని కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్‌ అన్నారు.

నిర్మల్‌ జిల్లాలో కరాటే అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రతినిధులు

కడెం, నవంబరు 26 : జిల్లాలో కరాటే అభివృద్ధికి కృషి చేస్తామ ని కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌ లో కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్మల్‌ జిల్లా కమిటీ స భ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి భూమేష్‌ మాట్లాడారు. జిల్లాలో కరాటే సర్వతోముఖాభివృద్ధికై ఐక్యతతో కృషి చేస్తామన్నారు. విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప తకాలు సాధించేలా కృషి చేస్తూ జిల్లాకు కరాటేలో ఉన్నత స్థానం లభించేలా ముందుకు సాగుతామని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోశాధికారి వి.కిషన్‌, సహయ కార్యదర్శి జెట్టి వెంకటేష్‌, సభ్యులు గుంపుల విజయ్‌ కుమార్‌, జి.రాజేందర్‌, బి.రఘు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:15:26+05:30 IST