ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2020-04-12T09:42:16+05:30 IST

వేసవిలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఎక్క డో ఓ చోట ప్రతి నిత్యం తాగునీటి సమస్య ఉత్పన్నమవుతునే వుంది.

ప్రమాద ఘంటికలు

జిల్లా వ్యాప్తంగా పడిపోతున్న భూగర్భ జలాలు

వేసవిలోనూ దాహం తీర్చని మిషన్‌ భగీరథ 

సింగూర్‌ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్‌ నుంచి నీరిందిస్తామన్న మాటలు నెరవేరని వైనం

తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు

వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్న ప్రజలు


ఎల్లారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 11: వేసవిలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఎక్క డో ఓ చోట ప్రతి నిత్యం తాగునీటి సమస్య ఉత్పన్నమవుతునే వుంది. గత వారం, పది రోజులుగా ఎండలు ముదిరిపోవడంతో కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాల మట్టం క్రమంగా పడిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రక్షిత మంచినీటి పథకాలకు నీరందించే బోర్లు ఎండిపోవడం, కొన్ని పాడైపోతుండడం తో వాటిపైనే ఆధారపడిన ప్రజలు గుక్కెడు నీటి కోసం కన్నీటి కష్టాలు పడుతున్నారు. కాగా వేసవిలో తాగునీటి కష్టాలను తొలగిస్తామని ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీరు అందిస్తామన్న అధికారుల హామీ నెరవేరకుండానే పోయింది.


జిల్లాలోని పలు గ్రామాలు, తండాలలో నీటి సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడం ఆందోళ నగా మారింది. గ్రామాల్లో నీటి లభ్యతకు లేకపోవడంతో గ్రామాలలోని మహిళలు, పురుషు లు, పెద్ద, చిన్న తేడా లేకుండా సమీపంలోని వ్యవసాయ బావుల నుంచి రెండు, మూడు బిందెలను తీసుకువచ్చి కాలం వెల్లదీస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో భూగర్భ జలాలు మరింత తగ్గిపోయే అవకా శాలున్నాయని, దీంతో ప్రతీ వేసవి మాదిరిగానే తమకు నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సింగూర్‌ ప్రాజెక్టులో ఉన్న నీటి ద్వారా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని జిల్లాలోని మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా విలేజ్‌ పైప్‌లైన్‌ల ద్వారా ప్రతీ గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పిం చి, ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రజలు వేడుకుం టున్నారు.


జిల్లాలో మొదలైన తాగు నీటి కష్టాలు

జిల్లా వ్యాప్తంగా ఈ వేసవిలో తాగునీటి కోసం పలుచోట్ల ప్రజలు తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం, పది రోజులుగా గ్రామాలలో వేసవి దృష్ట్యా రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతుండడం, బావులు, చెరువులలో నీరు ఇంకిపోతుండడంతో గ్రామాలలోని బోర్లు ఎత్తిపోస్తున్నాయి.


దీంతో జిల్లా లోని పలు గ్రామాలలో తాగు నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నీటి కోసం ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని ప్రజ లు గత కొన్ని రోజులుగా తాగు నీటి సమస్యతో బాధపడుతున్నారు. పక్కనే ఉన్న పంట పొలాల బోరు బావుల నుంచి తాగునీటిని తీసుకువచ్చి కాలం వెల్ల దీస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు స్పందించి తమ నీటి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. 


వేసవిలోనూ ఆదుకోని ‘మిషన్‌ భగీరథ’

జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి ని అందిస్తామని అధికార యంత్రాంగం కసరత్తు చేసినప్పటికీ, అమలు మా త్రం సాధ్యపడకుండా పోయింది. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో వరి పంట ను రెట్టింపు స్థాయిలో సాగు చేయడంతో నీటి వాడకం ఎక్కువైంది. మరోవైపు ఎండలు కూడా 40డిగ్రీల వరకు పెరగడంతో క్రమంగా భూగర్భ జలాలు తగ్గు ముఖం పడుతున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలతో పల్లెల్లో నీటి కష్టాలు ఇప్పటికే పలుచోట్ల మొదలయ్యాయి.


బోర్లు వట్టిపోస్తుండడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలను తీర్చేందుకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా కొన్ని ప్రాంతాలలో మిషన్‌భగరీఽథ వాటర్‌గ్రిడ్‌ పైప్‌లైన్‌ల ద్వారా ఇది వరకు తాగునీటి కష్టాలు తీర్చినప్పటికీ సింగూర్‌ ప్రాజెక్టులో పరిమిత నీటి లభ్యత కారణంగా ఏప్రిల్‌ నుంచి రెండు రోజులకు ఒకసారైనా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. కానీ జాతీయ రహదారి పనుల కారణం చూపుతూ నేటికి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు సరఫరా చేయకపోవడంతో తాగునీటి కోసం కష్టాలు మాత్రం తప్పడం లేదు.

Updated Date - 2020-04-12T09:42:16+05:30 IST