సీఎం సహాయ నిధికి విరాళం
ABN , First Publish Date - 2020-04-07T10:42:23+05:30 IST
కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చాట్ల బీడీ కంపెనీ అధి నేత ఉపేందర్ ముఖ్యమంత్రి సహాయ నిధి

కామారెడ్డి,ఏప్రిల్6: కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చాట్ల బీడీ కంపెనీ అధి నేత ఉపేందర్ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందులకు సంబంధించిన చెక్‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు అందించారు. కరో నా వైరస్ మహమ్మరి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో కలిసి వచ్చి రూ.5 లక్షల విరాళం ఇచ్చిన చాట్ల ఉపేందర్‌కు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అభినందించారు. ఈ ఐదు లక్షల విరాళం చెక్కును బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ప్రభుత్వ విప్ కలిసి అందజేశారు. ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చిన ఉపేందర్‌ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.