కరోనా వస్తే ఆందోళన చెందొద్దు
ABN , First Publish Date - 2020-08-22T10:38:08+05:30 IST
కరోనా వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షలు నిర్వహించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని అదన పు కలెక్టర్ లత
అదనపు కలెక్టర్ లత
బోధన్, ఆగస్టు 21: కరోనా వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షలు నిర్వహించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని అదన పు కలెక్టర్ లత సూచించారు. శుక్రవారం ఆమె బోధన్ ఎమ్మెల్యే షకీల్ సొం త డబ్బులతో పట్టణంలో కరోనా పరీక్షలు నిర్విహించేందుకు అందజేసిన అం బులెన్స్‌ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మా ట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ నాలుగు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం అభి నందనీయమన్నారు. జిల్లాలో కోవిడ్ పరీక్షలను పెంచినట్లు ఆమె తెలిపారు. కొవిడ్ వైరస్ పట్ల ముందు జాగ్రత్తలు తీసుకొని సూచనలు సలహాలు పా టించాలని ఆమె సూచించారు. అన్ని పీహెచ్‌సీలకు, సీహెచ్‌సీలకు కొవిడ్ ప రీక్ష కిట్లను పంపడం జరిగిందని ఒక్కో కేంద్రంలో రోజుకు 50 పరీక్షలు జరి పేలా కిట్లను అందుబాటులో ఉంచామన్నారు.
పట్టణంలోని పాన్‌గల్లి క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. కొ విడ్ లక్షణాలు ఉంటే తప్పనిసరి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదే విధ ంగా హరితహారం లక్ష్యాన్ని నేరవేర్చాలని అదనపు కలెక్టర్ లత సూచిం చా రు. హరితహరంలో నాటిన మొక్కలను కాపాడాలన్నారు. ఈ కార్య క్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, వైస్ చైర్మన్ ఎత్తేశం సోహెల్, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కౌన్సిలర్‌లు శరత్‌రెడ్డి, దూప్‌సింగ్, రాధా కృష్ణ, శ్రీకాంత్‌గౌడ్, పిట్ల సత్యం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.