‘ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతించడం తగదు’

ABN , First Publish Date - 2020-12-12T05:14:16+05:30 IST

ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు సెం ట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అనుమతించడం తగదని ఐఎంఏ, ఐడీఏ సభ్యులు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం అందించారు.

‘ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతించడం తగదు’
కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తున్న వైద్యులు

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 11: ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు సెం ట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అనుమతించడం తగదని ఐఎంఏ, ఐడీఏ సభ్యులు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులకు 58 శస్త్ర చికిత్సలకు అనుమతులు ఇవ్వడం పట్ల పట్టణంలో అన్ని ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిపివేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, ఐఎంఏ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌, ఐడీఏ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, వైద్యులు మల్లిఖార్జున్‌, సాజిద్‌, అభిషేక్‌, ప్రవీణ్‌, శ్రవణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో ఆస్పత్రుల బంద్‌
బాన్సువాడ టౌన్‌,  డిసెంబరు 11: ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ, ఐడీఏ ఆధ్వర్యంలో వైద్యులు శుక్రవారం బాన్సువాడ పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రుల బంద్‌ పాటించారు. ఈసందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు నిర్వహించేలా అనుమతులు ఇస్తామనడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని వారు కోరారు. ఈ బంద్‌లో ఐఎంఏ ప్రతినిధులు డా. జీవన్‌రెడ్డి, బాబుసింధే, సంతోష్‌రెడ్డి, కిరణ్‌, సాయిలీల, ఐడీఏ ప్రతినిధులు డా. జీవన్‌, అనిల్‌, విశాల్‌, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:14:16+05:30 IST