ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన వైద్యుడు

ABN , First Publish Date - 2020-07-19T08:06:43+05:30 IST

డిచ్‌పల్లి మండల కేంద్రంలో శివాలయం నిర్మాణ కమిటీ స భ్యుడు చెంచిరెడ్డి, నర్సింగపూర్‌ మాజీ స ర్పంచ్‌..

ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన వైద్యుడు

  • డాక్టర్‌ ఇంటి ముందు స్థానికుల ఆందోళన 
  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు 

డిచ్‌పల్లి, జూలై 18: డిచ్‌పల్లి మండల కేంద్రంలో శివాలయం నిర్మాణ కమిటీ స భ్యుడు చెంచిరెడ్డి, నర్సింగపూర్‌ మాజీ స ర్పంచ్‌ మురళిపై మండల కేంద్రానికి చెందిన డాక్టర్‌ ఆశోక్‌ పాత కక్షలతో దాడి చేసి కొట్టాడని స్థానికులు ఆగ్రహం వ్య క్తం చేశారు. తమతో మాట్లాడే పని ఉం దని ఆయన  శనివారం మధ్యాహ్నం పి లిపించి శివాలయం భూముల విషయం లో తమపై దాడి చేయడం ఎంతవరకు సమంజమని, దాడి చేసిన డాక్టర్‌పై కఠి న చర్యలు తీసుకోవాలని వారు పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. తమ వాళ్లపై దాడి చేయడం ఏమిటని డాక్టర్‌ ఇంటికి బాధితుల బంధువులు, దేవాలయ కమిటీ సభ్యులు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనపై దాడికి పూనుకోగా, వైద్యుడు ఇంట్లోనుంచి స్థా నికులపై పొడికారం చల్లారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఇంట్లో దాగి ఉన్న డాక్టర్‌ను బయటకు లా గేందుకు తలుపులను సైతం విరగ్గొట్టారు.  కోపోద్రిక్తులైన స్థానికులు అక్కడే ఉన్న డాక్టర్‌ అంగరక్షకులను  చితగ్గొట్టారు. మరో సారి శివాలయం భూముల జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన వైద్యుడు పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వైద్యుడిని ఠాణాకు తరలించారు. బాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో డాక్టర్‌ ఆశోక్‌ కూడా తనపై దాడికి వచ్చిన వారిపై పిర్యాదు చేయగా, దాడి లో గాయపడిన చెంచిరెడ్డి కూడా ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ సు రేష్‌కుమార్‌ తెలిపారు. 


సర్వే ఆలస్యమే దాడికి కారణమా?

 రెండు వారాల కిందట డిచ్‌పల్లి బస్టాండ్‌ పక్కనున్న చెరువు శిఖం స్థలాన్ని శివాలయం కమిటీ సభ్యుల సూచనల మేరకు సర్వే జరిపి ఇప్పటి వరకు రిపోర్టు ఇవ్వకపోవడంతోనే దాడి జరిగినట్లు దేవాలయ కమిటీ సభ్యులు చర్చింకుంటున్నారు. రెండ్రోజుల్లోగా సర్వే వివరాలు అధికారులు తేల్చకుంటే పరిస్థితి మరింత చే యిదాటే ఆవకాశముందని స్థానికులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-07-19T08:06:43+05:30 IST