ఎల్‌ఐసీని ప్రైవేటీకరించొద్దు
ABN , First Publish Date - 2020-11-27T06:01:46+05:30 IST
దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమాని కి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్ ఐసీని ప్రైవేటీకరించవద్దని అఖిల భారత బీమా ఉద్యోగుల అసోసియేషన్ నిజామాబాద్ శాఖ కా ర్యదర్శి డి.సురేష్ కోరారు.

పెద్దబజార్, నవంబరు 26: దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమాని కి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్ ఐసీని ప్రైవేటీకరించవద్దని అఖిల భారత బీమా ఉద్యోగుల అసోసియేషన్ నిజామాబాద్ శాఖ కా ర్యదర్శి డి.సురేష్ కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట గు రువారం ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎల్‌ఐసీలోని తన వాటాలను కొంత శాతం కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలకు వి క్రయించాలని చూడడం దేశ ప్రయోజనాల ను దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఎల్‌ఐ సీ నిధులను స్టాక్ మార్కెట్‌లలో పెడితే ప్రజల సొమ్ముకు భద్రత లేకుండా పోతేంద ని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించుకుంటూ పోతే ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని విమర్శించారు. లాభాల్లో కొనసాగుతున్న ఎల్‌ఐసీని కాపాడు కోవడానికి ఉద్యోగులు బీమా సంస్థల ఉద్యో గుల సంఘం (ఐసీఐయూ) ఆధ్వర్యంలో పో రాడాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా ఉద్యోగ, వ్యవసాయ వ్య తిరేక విధానాల అమలుకు పూనుకుందని వి మర్శించారు. కార్యక్రమంలో బీమా సంస్థ ఉ ద్యోగుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు ఆనం ద్‌కుమార్, శివశంకర్, సంయుక్త కార్యదర్శి గంగాధర్, సంఘ నేతలు దేవచారి, సత్యనారాయణ, కళ్యాపూర్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.