నిర్లక్ష్యం చేయొద్దు
ABN , First Publish Date - 2020-12-02T04:22:22+05:30 IST
మూగ జీవా ల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మోపాల్ మండల కేంద్రంలో గొర్రెల, మేకలకు ఉచిత నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
జీవాలకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
మోపాల్, డిసెంబరు 1: మూగ జీవా ల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మోపాల్ మండల కేంద్రంలో గొర్రెల, మేకలకు ఉచిత నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మూగజీవు ల పట్ల నిర్లక్ష్యం వహించవద్దన్నారు. క్ర మం తప్పకుండా వాటి మందులు వేయాలన్నారు. మేకలకు, గొర్రెలకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్ర భుత్వం ప్రతీ సంవత్సరం మూడు సార్లు నట్టల నివారణ మందు పంపిణీ చేస్తోం దన్నారు. గొర్రెల కాపలాదారులు తప్పకుండా మందులను వేయించాలన్నారు. గొర్రెలు, మేకలు ఆరోగ్యవంతంగా ఉన్న ప్పుడే లాభాలను గడిస్తారని తెలిపారు. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు జి ల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కరోనా వ్యాధి రా వడం వల్ల కొద్దిగా ఆలస్యమైందన్నారు. మండలానికి మేకలకు, గొర్రెలకు 200 షె డ్లు మంజూరయ్యాయని తెలిపారు. కావలసిన వారు తమకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ సం చాలకుడు డాక్టర్ ఎల్లన్న మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల 36 వేల గొ ర్రెలు, లక్షా 57 వేల మేకలు ఉన్నాయని వివరించారు. సుమారు వాటికి రూ.20 లక్షల వ్యయంతో ఉచితంగా నట్టల నివారణ మందును ప్రభుత్వం వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్, ఎంపీటీసీలు ముత్యం, రాములు, నాయకులు కాన్షీరాం, ఉపసర్పంచ్ రవి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.