‘స్వలాభం కోసం ప్రకటనలు చేయొద్దు’

ABN , First Publish Date - 2020-11-26T05:54:32+05:30 IST

స్వలాభం కోసం ఇష్టారీతిలో ప్రకటనలు చేయవద్దని తపాస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు.

‘స్వలాభం కోసం ప్రకటనలు చేయొద్దు’
సమావేశంలో మాట్లాడుతున్న తపాస్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి

కామారెడ్డిటౌన్‌, నవంబరు 25 : స్వలాభం కోసం ఇష్టారీతిలో ప్రకటనలు చేయవద్దని తపాస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఒక రా జకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమే అ వుతుందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల కోసం తప్ప రాజకీయపక్షాల కోసం కాదని తెలిపారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతిసేవిధంగా రాజకీ య పార్టీల కార్యకర్తలా ప్రవర్తించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ప్రధాన కా ర్యదర్శి సంతోష్‌, రవీంద్రనాథ్‌, రాజ్‌కుమార్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T05:54:32+05:30 IST