రాంపూర్‌ సర్పంచ్‌ను విచారించిన డీఎల్‌పీవో

ABN , First Publish Date - 2020-06-16T11:09:51+05:30 IST

మండలంలోని రాంపూర్‌ సర్పంచ్‌ ఆలకుంట హన్మవ్వను సోమవారం డీఎల్‌పీవో రాజేంద్రప్రసాద్‌ విచారించారు.

రాంపూర్‌ సర్పంచ్‌ను విచారించిన డీఎల్‌పీవో

లింగంపేట, జూన్‌ 15 : మండలంలోని రాంపూర్‌ సర్పంచ్‌ ఆలకుంట హన్మవ్వను సోమవారం డీఎల్‌పీవో రాజేంద్రప్రసాద్‌ విచారించారు. ఆమె పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌ను వార్డు సభ్యులను గ్రామస్థులను వేర్వేరుగా విచారించినట్లు ఆయ న తెలిపారు. గ్రామంలో సింగల్‌ఫేజ్‌ మోటారు బిగించకుండానే ఎంబీ చేసి డబ్బులు తీసుకున్నారని, పైపులైన్‌ కోసం రూ.30వేలు ఖర్చు చేసి రూ.67వేలు డ్రాచేశారని, గ్రామంలో శ్మశానవాటిక వద్ద వేసిన బోరుమోటారుకు పంచాయతీ తీర్మానం లేదని, మోరం రోడ్డు వేసి రోలర్‌తో తొక్కించకుండానే డబ్బులు తీసుకున్నారని, ఇంటి ప న్నులు వసూలు చేస్తూ పంచాయతీ అకౌంట్‌లో జమచేయకుండా నేరుగా ఖర్చు చే సుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. దానికి సంబంధించిన ఎంబీ రికా ర్డులను, పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, రికార్డులను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని తెలిపారు. విచారణలో ఎంపీవో ప్రభాకరచారి, సర్పంచ్‌ హన్మవ్వ, వార్డు సభ్యులు గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2020-06-16T11:09:51+05:30 IST