రాష్ట్ర స్థాయి ఖోఖో ప్రిమియర్ లీగ్‌కు జిల్లా క్రీడాకారులు
ABN , First Publish Date - 2020-12-27T06:14:22+05:30 IST
రాష్ట్ర స్థాయి ఖోఖో ప్రీమియర్ లీగ్‌కు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి టి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు.

సుభాష్‌నగర్, డిసెంబరు 26: రాష్ట్ర స్థాయి ఖోఖో ప్రీమియర్ లీగ్‌కు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి టి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈశ్వర్, సుధాకర్, దినేష్, బలరాం 26, 27 తేదిల్లో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఖోఖో ప్రీమియర్ లీగ్ పోటీల్లో పాల్గొననున్నారు. టెక్నికల్ ఆఫీషియల్‌గా శ్రీకాంత్ వ్యవహరించనున్నారు. క్రీడాకారులను ఖోఖో సంఘం ఛైర్మన్ సంతోష్‌కుమార్ నాయక్, ఖోఖో సంఘం అధ్యక్షుడు అతికుల్లా, సంఘం బాధ్యుడు ఎం.వి.సుబ్బారావు, భూమారెడ్డి, రాజ్‌కుమార్, రాజేంధర్, రాము, గంగారెడ్డి, నగేష్, ప్రేమ్‌కుమార్, సుజాత, సిందూజ, సౌజన్య అభినందించారు.