టీయూలో పదోన్నతుల పంచాయితీ

ABN , First Publish Date - 2020-12-29T05:46:49+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. ప్రొఫెసర్‌ల పోస్టుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో పారదర్శకత, యూజీసీ నిబంధనలు పాటించలేదని పలువురు అధ్యాపకులు ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

టీయూలో పదోన్నతుల పంచాయితీ

అవకతవకలపై ఇన్‌చార్జి వీసీకి ఫిర్యాదులు

అర్హులైన వారిని ఇంటర్వ్యూకు పిలవలేదని ఆరోపణలు

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న ప్రొఫెసర్లు

నిజామాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. ప్రొఫెసర్‌ల పోస్టుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో పారదర్శకత, యూజీసీ నిబంధనలు పాటించలేదని పలువురు అధ్యాపకులు ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకు న్న వారి స్ర్కూట్నీ వివరాలు ప్రకటించకుండానే ఇంటర్వ్యూ లు నిర్వహించారని ఉన్నతాధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ వీటి పై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొం త మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

వంద మందికిపైగా దరఖాస్తు

విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ పోస్టుల పదోన్నతి కోసం ఈ మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహిచి న లుగురిని ఎంపిక చేశారు. పదోన్నతలు కోసం వంద మంది కిపైగా అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ప్రొఫెసర్‌ పదోన్నతుల కోసం 12 మందిని పిలిచి.. వారిలో నలుగురిని ఎంపిక చేశా రు. యూజీసీ నిబంధనల ప్రకారం దరఖాస్తులను మొదట స్ర్కూట్నీ చేస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారి వివరాలను ప్రకటిస్తారు. నిబంధనల మేరకు వారిని పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించి పదోన్నతులను కల్పిస్తారు. ప్రొఫెసర్‌ పదోన్నతులకు తొమ్మిది సంవత్సరాలకుపైగా అ సోసియేట్‌లో పనిచేసి ఉండడంతో పాటు పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో విశ్వవిద్యాలయం వీసీ, డీన్‌, ఎస్సీ ఎస్టీ నామినీలు సంబంధిత  ప్రొఫెసర్స్‌, గవర్నర్‌ నామినీ ఉండాలి. నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయాలి. ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూల్లో నిబంధనల ప్రకారం కొద్ది మంది ద్వారానే వీ రిని పూర్తిచేశారని దరఖాస్తు చేసుకున్న వారు ఆరోపించా రు. తొమ్మిది సంవత్సరాల సర్వీసుతో పాటు చేరేటప్పటికి పీ హెచ్‌డీ లేని వారికి ప్రస్తుతం పదోన్నతులు కల్పించారని వి శ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన వారికి పదోన్న తులు కల్పించి న్యాయం చేయాలని వారు ఇన్‌ఛార్జి వీసీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. మరికొంత మంది ఈ ఇంట ర్వ్యూలను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు. కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.  

నిబంధనల మేరకే చేశాం

టీయూ రిజిస్ట్రార్‌ నసీమా

 ఇంటర్వ్యూలన్నీ నిబంధనల మేరకే చేశాం. ఇంటర్వ్యూ బోర్డులో అందరు సభ్యులు ఉన్నారు. సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ కూడా హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఇంటర్వ్యూలను నిర్వహించాం. అర్హులైన వారికే పదోన్నతులు కల్పించాం. ఎలాంటి దాపరీకాలు లేకు ండానే ఈ ఇంటర్వ్యూలను నిర్వహించాం.

Updated Date - 2020-12-29T05:46:49+05:30 IST