కేజ్‌వీల్‌తో రోడ్లన్నీ ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-21T04:50:12+05:30 IST

గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు మెరుగైన దారిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రోడ్లను వేసింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తుంటే కొందరు స్వప్రయోజనాల కోసం రోడ్లపై కేజ్‌వీళ్లను నడుపుతూ ధ్వంసం చేస్తు న్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

కేజ్‌వీల్‌తో రోడ్లన్నీ ధ్వంసం
రోడ్డుపై తిరుగుతున్న కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌

నిత్యం రోడ్లపైన తిరుగుతున్న కేజ్‌వీల్‌ ట్రాక్టర్లు
రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు

గాంధారి, డిసెంబరు 20: గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు మెరుగైన దారిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రోడ్లను వేసింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తుంటే కొందరు స్వప్రయోజనాల కోసం రోడ్లపై కేజ్‌వీళ్లను నడుపుతూ ధ్వంసం చేస్తు న్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్లన్నీ ధ్వంసమై వాహనాలు అదుపు తప్పి గాయాలపాలవుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధారి మండలంలోని గండివేట్‌, సీతాయి పల్లి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా బీటీ రోడ్లపైన, సీసీ రోడ్లపై యథేచ్ఛగా కేజ్‌విల్‌లు తిరుగుతున్నాయి. దీంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థు లు ఆరోపిస్తున్నారు. రోడ్లన్నీ గుంతలు పడ డంతో రాళ్లు తేలి వాహనాలు అదుపుతప్పి కింద పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్ప టికైనా అధికారులు స్పందించి కేజ్‌వీల్‌ ట్రాక్ట ర్లను రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవ ాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-21T04:50:12+05:30 IST