నేటి నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-10-03T10:04:27+05:30 IST
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్ట్‌మెంట్ టెస్టులు ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ..

నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 2: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్ట్‌మెంట్ టెస్టులు ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లను వెబ్‌సైట్‌లో ఉంచిన ట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఫోన్‌లు తీసుకురావద్దని సూచించారు. హాల్‌టికెట్‌తోపా టు మాస్కు, శానిటైజర్ తప్పకుండా తీసుకురావాలని తెలిపారు.
20 కేంద్రాల్లో టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష..
ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని 20 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీఈవో దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు శానిటైజర్, మాస్కు, బాల్‌పెన్, ప్యాడ్ వెంట తెచ్చుకోవడంతో పాటు కొవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు రావాలని సూచించారు. అరగంట ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని వెంట తాగునీరుకు అనుమతి ఉంటుందని, కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదులు కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం 99854 32021 నెంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2020-21 విద్యాసంవత్సరానికి గాను 10వ తరగతి మార్చి 2020లో జీపీఏ 7.0 కంటే ఎక్కువ పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఈనెల 17 వరకు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తెలంగాణ ఈపాస్.సీజీజీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపికైన విద్యార్థులకు ఈనెల 19న సమాచారం వస్తుందని తెలిపారు. 20వ తేదీన సర్టిఫికెట్లతో సంబంధిత కార్యాలయాల్లో హాజరుకావాలని ఆయన తెలిపారు.