‘ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2020-12-31T05:07:07+05:30 IST
దళితులపై వివక్ష చూపుతున్న ఇందల్వా యి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మా ర్పీఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి గందమాల నాగభూషణం మాదిగ కోరారు.

ఇందల్వాయి, డిసెంబరు 30: దళితులపై వివక్ష చూపుతున్న ఇందల్వా యి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మా ర్పీఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి గందమాల నాగభూషణం మాదిగ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లాపూర్‌లో సట్ల సాయమ్మ భూమిని సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉపసర్పంచ్ రఘునందన్, చాకలి భూమ గంగారాం కబ్జా చేశారన్నారు. ఇది ఏమటని ప్రశ్నించినందుకు సాయమ్మను కు లం పేరుతో దూషిస్తూ కొట్టినట్లు చెప్పారు. ఈనెల 27న ఇందల్వాయి పో లీస్‌స్టేషన్‌లో ముగ్గురిపై ఆమె ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఎస్సై ఎలాం టి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో శ్యామ్, సంతోష్, ప్రమోద్, మహేందర్ పాల్గొన్నారు.