రెవెన్యూశాఖపై నిఘా

ABN , First Publish Date - 2020-09-21T07:09:59+05:30 IST

కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర సర్కారు తాజాగా ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టిన ట్లు తెలుస్తోంది. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన ప్ర భుత్వం

రెవెన్యూశాఖపై నిఘా

రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం నజర్‌

జిల్లాల వారీగా అధికారుల వివరాల సేకరణ

నిఘా వర్గాల ద్వారా సమాచార సేకరణ

కొత్త చట్టం అమలులోకి రాగానే బదిలీలు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టే అవకాశం

రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన


నిజామాబాద్‌, సెప్టెంబరు 20  (ఆంద్రజ్యోతి ప్రతినిధి)

 కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర సర్కారు తాజాగా ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టిన ట్లు తెలుస్తోంది. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన ప్ర భుత్వం కింది స్థాయిలో ఏ స్థాయిలో అవినీతి ఉందో పరిశీలిస్తోంది. మండల, డివిజన్‌ స్థాయిలో అధికారు ల పనితీరుపై నివేదికలు తీసుకుంటునట్లు సమాచారం. నిఘావర్గాలతో పాటు ఏసీబీ వద్ద నుంచి కూడా సమాచారం సేకరించినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టంలో లూప్‌ పోల్స్‌ ఉండకుండా చూస్తునే రెవెన్యూశాఖలో అవినీతి తగ్గించేందుకు జిల్లాల వారీగా నివేదికలు సిద్ధ్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టం అమలులోకి రాగానే కొంత 


మంది అధి కారులను బదిలీ 

చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉ న్నవారిని లూప్‌లైన్‌లో వేసేందుకు రంగం సిద్ధ్దం చేస్తు న్నట్లు సమాచారం. భూ సమస్యలు తలెత్తకుండా ఉం డేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెస్తోంది. రె వెన్యూ శాఖలో కింది స్థాయిలో ఎక్కువగా అవినీతి జ రుగుతోందని భావించిన ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసింది. చట్టం అమలులోకి తీసుకవచ్చేందుకు చ ర్యలు చేపట్టింది. అప్పటి వరకు భూ సంబంధిత రిజి స్ట్రేషన్లను నిలిపివేసింది. ధరణి వెబ్‌సైట్‌ సేవలను ఆపి వేసింది. వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు ఎంత మంది పనిచేస్తు న్నారో జిల్లాల వారీగా వివరాలు సేకరించింది. ప్రత్యేక ఫార్మాట్‌ ద్వారా జిల్లా అధికారులు వారి వివరాలను ప్ర భుత్వానికి పంపించింది. రాష్ట్రంలో భూ సమస్యలు మ ళ్లీ రాకుండా కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతి పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న సమయం లోనే రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు ఏసీబీకి లంచం తీసుకుంటూ దొరికారు. వీరిలో తహసీ ల్దార్‌ క్యాడర్‌ నుంచి అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారి వరకు ఉన్నారు. వీరితో పాటు ఆర్డీవో స్థాయి అధికారు లు సస్పెండ్‌ అయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల పరి ధిలోని అధికారులపైన కూడా ఈ ఆరోపణలు వచ్చా యి.


కింది స్థాయే కాకుండా ఉన్నతస్థాయి అధికారుల పైన కూడా ఆరోపణలు వస్తుండడంతో ప్రభుత్వం జి ల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలతో పాటు ఏసీబీ అధికారుల ద్వారా జిల్లాకు కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్‌ ఎంపికచేసి అధికారులు, ఉద్యోగుల పనితీరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రె వెన్యూ శాఖలో ఏయే కార్యక్ర మాలు జరుగుతున్నా యి? వేటిలో ఎక్కువ గా అవినీతికి ఆస్కారం ఉందో పరిశీలి స్తున్నట్లు తె లుస్తోంది. భూముల మ్యూటేషన్స్‌, పట్టాల పంపిణీ, విరాసత్‌, భూ సంబంధిత తప్పుల స వరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ని వేదికలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు సం బంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే మున్సిపాలిటీ లు, జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారికి పక్కనున్న మండలాలపై దృష్టి పెట్టినట్లు అధికారుల వర్గాల స మాచారం బట్టి తెలుస్తోంది.


కొత్త రెవెన్యూ చట్టం అమ లులోకి రాగానే వీఆర్‌వోలను ఆయా శాఖలలో కేటాయి ంచనున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికే వివరాలు సేకరించి న ప్రభుత్వం నెలాఖరులోపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు వీఆర్‌ఏలను కూడా కేటా యించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల బదిలీ చేయా లని నిర్ణయం మేరకే అన్ని జిల్లాల పరిధిలోని డిప్యూటి తహసీల్దార్‌లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే పదో న్నతులు ఇచ్చి తహసీల్దార్‌లను బదిలీ చేయనున్నట్లు తెలు స్తోంది. వీరితో పాటు రాష్ట్ర స్థాయిలో ఆరోపణలు ఎదు ర్కొంటున్న డివిజన్‌ స్థాయి అధికారులు, అదనపు కలెక్టర్ల బదిలీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆరోప ణలు వచ్చిన వారిని లూప్‌లైన్‌లో నియమించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా వివరాలను సేకరించినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం అమ లులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధమైన నిర్ణ యం తీసుకుంటుందో కొద్ది రోజుల్లో తేలనుంది. 

Updated Date - 2020-09-21T07:09:59+05:30 IST