ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించిన డీఈవో

ABN , First Publish Date - 2020-11-27T05:53:43+05:30 IST

జిల్లా కేంద్రంలోని దారుగల్లి పాఠశాల, శంకర్‌భవన్‌, ఖిల్లా పాఠశాలలను జి ల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ గురువారం సందర్శించారు.

ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించిన డీఈవో
విద్యార్థిని నోట్‌బుక్‌ను పరిశీలిస్తున్న డీఈవో

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 26: జిల్లా కేంద్రంలోని దారుగల్లి పాఠశాల, శంకర్‌భవన్‌, ఖిల్లా పాఠశాలలను జి ల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరుపట్టికను పరిశీలించారు. ఆన్‌లైన్‌ తరగతుల తీరును పర్యవేక్షించారు. దారుగల్లీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని రిమ్సా ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ తరగతుల గురించి, పాఠ్యాంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

11 నుంచి జిల్లాస్థాయి ప్రేరణ ప్రదర్శనలు..

జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనను డిసెంబరు 11 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20కి సంబంధించిన ప్రేరణ ప్రదర్శన కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో  డీఎస్టీ, ఎన్‌ఐఎఫ్‌, ఎస్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇన్‌స్పైర్‌ అవార్డు పొందిన వి ద్యార్థులు, గైడ్‌ టీచర్‌లను ప్రదర్శనకు సిద్ధం కావాలన్నారు. డిసెంబరు ఒకటి నుంచి పదోతేదీ లోపు ప్రదర్శన వీడియో, ప్రదర్శన గురించి వివరణ, సంబంధిత ఫొటోలను ఇన్‌స్పై ర్‌ మాన్క్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని త్వరలోనే గైడ్‌ టీచర్‌లకు ఎన్‌ఐఎఫ్‌ ద్వారా జూమ్‌ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌ 9848219365ని సంప్రదించాలన్నారు.  


Read more