కరోనా ధాటికి.. తగ్గిన డెంగీ

ABN , First Publish Date - 2020-11-26T05:49:51+05:30 IST

ప్రతీ సంవత్సరం సీజన్‌ వచ్చిం దంటే డెంగీ జ్వరంతో విలవిల్లాడే ప్రజలు ఇప్పుడు కరోనా మహ మ్మరితో తల్లడిల్లుతున్నారు.

కరోనా ధాటికి..  తగ్గిన డెంగీ

ప్రతీ సంవత్సరం మూడు నెలలపాటు డెంగీతో ప్రజలకు దడదడ

ప్రస్తుత సీజన్‌లో ఒక్కకేసు నమోదు కాలేదంటున్న అధికారులు

గత ఏడాది అధికారికంగా 10 కేసులు  

ముందు జాగ్రత్తతోనే అంటున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

డెంగీ స్థానంలో కరోనా వైరస్‌ వణికిస్తున్న వైనం


కామారెడ్డిటౌన్‌, నవంబరు 25: ప్రతీ సంవత్సరం సీజన్‌ వచ్చిం దంటే డెంగీ జ్వరంతో విలవిల్లాడే ప్రజలు ఇప్పుడు కరోనా మహ మ్మరితో తల్లడిల్లుతున్నారు. జిల్లాలో డెంగీ జాడలు ఈసారి నామ రూపాల్లేకుండా పోయిందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొం టున్నారు. ప్రతీ సీజన్‌లో జిల్లాలో పదుల సంఖ్యలోనే కేసులు న మోదయ్యేవి. మరణాల సంఖ్య కూడా అనధికారికంగా ఎక్కువగానే ఉండేది. కానీ, ఈసారి సీజనల్‌ వ్యాధులకు ముందే కరోనా వి జృంభించడంతో డెంగీ వైరస్‌కు చోటు లేకుండా పోయిందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా రు. కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లా యం త్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందిం చి ప్రజలను అప్రమత్తం చే స్తూ వస్తుంది. అంతేకాకుండా మార్చి నుంచే పల్లెలు, పట్టణాల వరకు మున్సిపాలిటీలు, పంచాయతీ ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పారి శుధ్య నిర్వహణ, యాంటి లా ర్వా తదితర కార్యక్ర మాలు చేపట్టారు. అ యితే ఇవ్వన్నీ డెంగీ నియం త్రణకు తోడ్పడ్డాయని అధికారు లు చెబుతున్నారు.

సీజన్‌ వచ్చిందంటే విజృంభించే డెంగీ

ప్రతీ సంవత్సరం వర్షాకాలం సీజన్‌ వ చ్చివెళ్లిన తర్వాత పరిసరాల పరిశుభ్రంగా లేకపోవడం, పలుచోట్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో దోమ ల విజృంభణ పెరిగిపోయి డెంగీ జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేసేది. ముందస్తు చర్యలు తీసుకున్న ప్రతీ సీజన్‌లో డెంగీ విలయ తాండవం చేసేది. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంటుంది. కాగా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఒకింత ఊపిరి పీల్చుకునే అంశమనే చెప్పాలి. కరోనా విజృంభణతో నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందికి డెంగీ తోడైతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేదనే వాద నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ని 29 పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో ఏ మా త్రం లక్షణాలు కనిపించినా ప్రజలు పరీక్షలు చేయించు కోవడానికి ముందుకు వచ్చి అందుకు తగిన వి ధంగా మందులు వాడడంతో పాటు పౌష్టికాహా రం తీసుకుంటూ వ్యాధిని తగ్గించుకోవడంతో పా టు యాండిబాడిస్‌ను పెంచుకునే ప్రయత్నం చే స్తుండడం తో ఇతర వ్యాధుల భారిన పడకుండా ఉంటున్నారు.

గత ఏడాది విలయతాండవం..

జిల్లాలో గత ఏడాది డెంగీ విలయతాండవం చేసింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు వ్యాధి ఉధృతితో ప్రజలు అల్లడిపోయారు. పలు మండలంలో డెంగీ ప్రభావంతో ప్రజలు మంచం పట్టారంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పా టు వైరల్‌ ఫీవర్‌ ప్రభావం కూడా తోడవడంతో ప్రజలు మరింత అ ల్లడిపోయారు. గత ఏడాది జిల్లాలో అధికారికంగా 10 కేసులు న మోదు కాగా అనధికారికంగా 50కు పైగా కేసులు నమోదయినట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో నిండిపో యిన ఘటనలున్నాయి. బీబీపేట, మాచారెడ్డి మండలంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ అధిక కేసులు నమోదయ్యాయి.

కరోనాతో గజగజ..

ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్‌తో వణికిపోతున్నారు. లాక్‌డౌన్‌ విధించగా మొదట కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో కేసులు నమోదుకాగా ప్రస్తుతం 20 వేల చేరువలో కేసులు వచ్చాయి. వా టిలో 18 వేల మంది వరకు కొలుకోని డిశ్చార్జ్‌ అయినప్పటికీ చాలా మంది మృతిచెందారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పట్టణ ప్రాం తాలకే పరిమితమైన డెంగీ కేసులు 22 మండలాల్లోకి వ్యాప్తిచెందిం ది. దీంతో ప్రతీ మండలంలోనీ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వ స్తుంది. గతంలో రోజుకు సుమారు 100కుపైగా కేసులు నమోదుకా గా ప్రసుత్తం 20 లోపే కేసులు నమోదవుతున్నాయి. చలికాలం కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు జా గ్రత్తగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-11-26T05:49:51+05:30 IST