ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల కూల్చివేత

ABN , First Publish Date - 2020-06-04T10:29:09+05:30 IST

బోధన్‌ మండలంలోని సాలంపాడ్‌ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లను పంచా యతీ అధికారులు బుధవారం కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది.

ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల కూల్చివేత

బోధన్‌, జూన్‌ 3: బోధన్‌ మండలంలోని సాలంపాడ్‌ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లను పంచా యతీ అధికారులు బుధవారం కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. అధికారుల తీ రుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర మ్మ కాలనీలో సుమారు వంద కుటుంబాలకు స్థలాలను కేటాయించారు. వాటిలో గుడిసె లు, రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.


కొన్ని నిర్మాణాలు కెనాల్‌ సరిహద్దుల్లో ఉన్నాయని, ఆక్రమించుకున్నారంటూ పంచాయతీ అధికారులు బుధవారం కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వర్షాకాలంలో పిల్లాపాపలతో తా ము ఎక్కడ ఉండాలని, యేళ్ల తరబడిగా ఇక్కడే ఉంటున్నామని ఇళ్లను ఎలా కూల్చివేస్తార ని సర్పంచ్‌ భర్తతోపాటు కార్యదర్శి తీరుపై మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై ఆర్డీవో గోపిరాంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తమకు ఎలాం టి సమాచారం లేదన్నారు. 

Updated Date - 2020-06-04T10:29:09+05:30 IST