పరిసరాల పరిశుభ్రతలో ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2020-05-18T09:38:07+05:30 IST

సీజనల్‌ వ్యాధుల ని వారణ కోసం ప్రతీ ఆదివారం 10 గంటలకు 10 నిమి షాలు కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ..

పరిసరాల పరిశుభ్రతలో ప్రజాప్రతినిధులు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 17: సీజనల్‌ వ్యాధుల ని వారణ కోసం ప్రతీ ఆదివారం 10 గంటలకు 10 నిమి షాలు కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కదిలారు. తమ నివాసాలలో చెత్తను తొలగించడంతో పాటువృఽథాగా ఉన్న నీటిని పారబోశారు. ఆరోగ్యవంత మైన జీవనానికి పరిశుభ్రత, పచ్చదనం అవసరమని నొక్కిచెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సీజ నల్‌ వ్యాధులను అరికట్టవచ్చునని వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో స్పీకర్‌ పోచారం శ్రీ నివాస్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెత్తను తొలగించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మం త్రి ప్రశాంత్‌రెడ్డి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు స్పం దించారు.


తన సతీమణి నీరజారెడ్డితో కలిసి ఇంటి ఆ వరణలో ఉన్న చెత్తను తొలగించారు. డెంగ్యూ, మలేరి యా ఇతర వ్యాధులు రాకుండా నివారించాలంటే పరి సరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి అన్నారు. జి ల్లాలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణను శుభ్రం చే యాలని కోరారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు జడ్పీ చైర్మ న్‌ దాదన్న గారి విఠల్‌రావు తన ఇంటి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే నగర మేయర్‌ నీతూ కిరణ్‌ కూడా కేటీఆర్‌ పిలుపు మేరకు ఇంటి ఆవరణలో ఉన్న కుండీలను శుభ్రపరిచారు. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తన అధికార నివాసంలో చెత్తను తొలగించారు. పూలకుండీలను శుభ్రం చేశారు. ఆరోగ్యాలను కాపాడు కునేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 


ఎడపల్లిలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌

నవీపేట(ఎడపల్లి): ఎడపల్లి మండల కేంద్రంలో ఆ దివారం జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితయాదవ్‌ తన ఇం ట్లో పరిసరాలను శుభ్రం చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన ఇంటి ఆవ రణలో పేరుకపోయిన పనికిరాని వస్తువులను ఆమె తొలగించారు. అనంతరం ఇంటి ఆవరణలో ఉన్న మొ క్కలకు నీరు పట్టారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిస రాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. 


భీమ్‌గల్‌లో స్పెషల్‌ డ్రైవ్‌..

భీమ్‌గల్‌: మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు భీమ్‌గల్‌ పట్టణంలో ఆదివారం చైర్‌ పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించా రు. సోడియం క్లోరైడ్‌ రసాయాన్ని స్ర్పే చేయించారు. సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గత వారం ఇళ్లల్లోని కుండలు, కూలర్‌లు, నీటి తొట్టిలను శుభ్రం చేసే కార్యక్రమం చే పట్టామని ఆమె తెలిపారు. ఈ వారం పలు వాడల్లో క చ్చ డ్రైనేజీలు ఉన్న చోట మురికినీరు నిల్వ ఉన్న చోట సోడియం క్లోరైడ్‌ రసాయాన్ని స్ర్పే చేయడం జరిగింద న్నారు. అదే విధంగా మురికినీరు నిల్వ ఉన్న చోట బ్లీ చింగ్‌పౌడర్‌తో పాటు ఆయిల్‌బాల్స్‌ వేశామన్నారు.


పట్టణంలోని పలు వార్డుల్లో వైద్యసిబ్బంది, ఆశ వర్కర్‌ ల ఆధ్వర్యంలో పారిశుధ్యం, వ్యాధుల నివారణపై అవ గాహన కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 10 గం టల 10నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, తదితర సీజనల్‌ వ్యాధులు సోకకుండా అవగాహన కలిగించామని తెలి పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌లు బిజ్జు గంగాధర్‌, మున్సిపల్‌ సిబ్బంది, ఆశ వర్కర్లు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T09:38:07+05:30 IST