ప్రశాంతంగా కొనసాగుతున్న టీయూ డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-11-03T10:40:23+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లో డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధి కారి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు

ప్రశాంతంగా కొనసాగుతున్న టీయూ డిగ్రీ పరీక్షలు

నిజామాబాద్‌ రూరల్‌, నవంబరు 2: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లో డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధి కారి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సులకు చెందిన బీఏ, బీ కాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌, ఎడ్యుకేషనల్‌ కోర్సులకు చెందిన బీఎడ్‌, ఎంఈ డీ పరీక్షలు సోమవారం ప్రశాతంగా జరిగాయని ఆయన తెలిపారు. ఉద యం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌, రె గ్యూలర్‌ పరీక్షలకు 4,749మందికి గాను 4,465 మంది హాజరయ్యారని, 284 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సీవోఈ తెలిపారు. బీఎడ్‌ 2వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 23మందికి గాను 21మంది హాజరయ్యారని ఇద్దరు వి ద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వర కు జరిగిన డిగ్రీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 24మంది హాజరయ్యారని, బీఏడ్‌ 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 140మందికి గాను 136మంది హాజ రు కాగా నలుగురు గైర్హాజరయ్యారని, ఎంఎడ్‌ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 9 మందికి గాను ఏడుగురు హాజరయ్యారని సీవోఈ తెలిపారు. 

Updated Date - 2020-11-03T10:40:23+05:30 IST