ట్రాన్స్‌కోకు తగ్గిన ఆదాయం

ABN , First Publish Date - 2020-04-25T09:40:22+05:30 IST

ట్రాన్స్‌కోపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పడుతోంది. లాక్‌డౌన్‌ కన్నా ముందు ప్రతీ నెల జిల్లా విద్యుత్‌ శాఖ కు సుమారు బిల్లుల రూపేనా కోట్ల

ట్రాన్స్‌కోకు తగ్గిన ఆదాయం

విద్యుత్‌ బిల్లులపై కరోనా ఎఫెక్ట్‌

మార్చి, ఏప్రిల్‌ నెలలో టార్గెట్‌ రూ.23 కోట్లు

వసూలైన బిల్లులు రూ.6 కోట్లు మాత్రమే

ఆర్థికంగా నష్టపోతున్న విద్యుత్‌శాఖ

ప్రజలు సకాలంలో బిల్లులు కడితేనే మేలు

బిల్లులు చెల్లించేందుకు అందుబాటులో ప్రత్యేక కౌంటర్‌లు, ఆన్‌లైన్‌ సౌకర్యం


కామారెడ్డి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌కోపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పడుతోంది. లాక్‌డౌన్‌ కన్నా ముందు ప్రతీ నెల జిల్లా విద్యుత్‌ శాఖ కు సుమారు బిల్లుల రూపేనా కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుండేది. గృహ వినియోగదారులే కాకుండా చిన్న, పెద్ద తరహ పరిశ్రమలతో పాటు వాణిజ్య, వ్యాపార సముదాయాల నుంచి భారీగానే బిల్లుల రూపంలో ఆదాయం వస్తుండేది. కానీ గత నెల రోజులుగా కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లాలో లాక్‌డౌన్‌ కొనసా గుతోంది. ప్రైవేట్‌తో పాటు పలు ప్రభుత్వరంగాలు సైతం మూసి ఉంటున్నాయి. దీంతో ప్రతీనెల విద్యుత్‌ బిల్లులు చెల్లించేవారు సైతం  చెల్లించలేకపోతున్నారు.


కనీసం విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి బిల్లులు వసూలు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి తోడు బిల్లులు చెల్లించే కేంద్రాలైనా ఈసేవ, ఇంటర్‌నెట్‌, ఆన్‌లైన్‌ కేంద్రాలు మూసి ఉండటంతో వినియోగదా రులు బిల్లులు చెల్లించలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కొంద రు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ గ్రామీణా ప్రాంతాల నుం చి బిల్లులు వసూలు కావడం లేదనే అభిప్రాయం ట్రాన్స్‌కో నుంచి వినిపిస్తోంది. లాక్‌డౌన్‌ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఎలాం టి ఉపాధి లేకపోవడంతో వారి నుంచి ఏ సంస్థలు కూడా ఒత్తిడి చేసి బిల్లులు వసూలు చేయవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


రెండు నెలలుగా వసూలైన బిల్లులు రూ. ఆరు కోట్లు

జిల్లాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో నెల రోజులుగా లాక్‌డౌన్‌ అమలవుతూ వస్తోంది. గత మార్చి నెలతో పాటు ఏప్రిల్‌లో విద్యు త్‌శాఖకు ఇప్పటి వరకు రూ. ఆరు కోట్లు మాత్రమే బిల్లులు వసూ ళ్లయ్యాయి. లాక్‌డౌన్‌ కన్న ముందు ప్రతీ నెల రూ.12 కోట్లకు పైగా విద్యుత్‌ బిల్లులు వసూళ్లయ్యేవి. కానీ ప్రస్తుతం నెలకు ఐదు కోట్లు కూడా వసూలు కావడం లేదని సంబంధిత శాఖధికారులు పేర్కొం టున్నారు. మార్చి నెలలో రూ.11.8 కోట్లు బిళ్లుల రూపేనా ఆదాయం రావాల్సిందిగా లక్ష్యం పెట్టుకున్నారు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ అమలు కావడంతో బిల్లులు పూర్తిస్థాయిలో వసూలు కాలేదు. మార్చి నెలలో రూ.4.93 కోట్లు మాత్రమే వసూళ్ల య్యాయి. మిగతా రూ. ఐదు కోట్లు బకాయిగా ఉండిపో యాయి.


అనగా ఈ నెలలో 41.81 శాతం మాత్రమే బిల్లులు వసూళ్లు అయినట్లు ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ నెలలో విద్యుత్‌ బిల్లు రూపేనా రూ. 12 కోట్లు రావాల్సిం దిగా లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో రూ.1.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.10 కోట్ల బకాయిలు ఉండిపోయా యి. అనగా 15.29 శాతం మాత్రమే బిల్లులు వసూలైనట్లు అధికా రులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-04-25T09:40:22+05:30 IST