జిల్లాలో ఐదుకు తగ్గిన కరోనా బాధితుల సంఖ్య

ABN , First Publish Date - 2020-05-10T11:26:25+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రస్తు తం జిల్లా నుంచి వెళ్లిన వారిలో కేవలం అయిదుగురు కరోనా బాధితులు మాత్ర మే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స

జిల్లాలో ఐదుకు తగ్గిన కరోనా బాధితుల సంఖ్య

పెద్దబజార్‌, మే 9: జిల్లాలో కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రస్తు తం జిల్లా నుంచి వెళ్లిన వారిలో కేవలం అయిదుగురు కరోనా బాధితులు మాత్ర మే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరో నా ప్రభావం మార్చి నెలలో ప్రారంభం కాగా.. ఆ నెలాఖరుతో పాటు ఏప్రిల్‌ నెల రెండో వారం వరకు తీవ్రంగా విజృంభంచింది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగి మొత్తం పాజిటివ్‌ల సంఖ్యం 61కి చేరింది. పాజిటివ్‌ వచ్చిన వారితో పా టు మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి ప్రైమరి, సెకండరి కాంటాక్ట్స్‌ను కూడా 14 రోజు ల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా 56 మంది డిశ్చార్జి అయ్యారు. మరొక అయిదుగురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. వీరు కూడా డిశ్చార్జి అయితే జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారనుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-05-10T11:26:25+05:30 IST