ఆట స్థలాల్లో పార్కుల నిర్మాణాన్ని విరమించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T05:25:46+05:30 IST
ప్రభుత్వ విద్యాసంస్థల ఆటస్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం పార్కుల నిర్మాణాల పేరుతో విలేజి పార్కులను నిర్మిస్తుందని, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నల్ల నవీన్ డిమాం డ్ చేశారు.
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 1: ప్రభుత్వ విద్యాసంస్థల ఆటస్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం పార్కుల నిర్మాణాల పేరుతో విలేజి పార్కులను నిర్మిస్తుందని, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నల్ల నవీన్ డిమాం డ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల ఆటస్థలాల్లో విలేజీ పార్కులను నిర్మించడంతో విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలాలను కోల్పోవలసి వస్తుందని అన్నారు. సమావేశంలో నాయకులు విజ్ఞాన్, సాయికుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.