దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-29T05:35:31+05:30 IST

సీఎం కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని డి మాండ్‌ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట, మోర్తాడ్‌లో ఆందోళన నిర్వహించారు.

దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

నిజామాబాద్‌  అర్బన్‌/ మోర్తాడ్‌, డిసెంబరు 28: సీఎం కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని డి మాండ్‌ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట, మోర్తాడ్‌లో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లింగం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు మూడెకరాల  భూమి ఇస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి భూమి ఇవ్వలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సకల జనులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు పోలీసు నియామకాలు తప్పా ఇంకా ఏ నియామకాలు జరగలేదన్నారు. అర్హులైన దళితులందరికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్‌లు మాస్టర్‌ శంకర్‌, ఎర్రం సుధీర్‌, నాయకులు నిచ్చెంగి కృష్ణ, జగదీశ్‌ కులకర్ణి, బీజేపీ మండలాధ్యక్షుడు పుప్పాల నరేష్‌, ఎంపీటీసీ ప్రశాంత్‌, బబ్బురు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:35:31+05:30 IST