సైకిల్‌, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-19T06:01:12+05:30 IST

నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్‌ గేట్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం సైకిల్‌, బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సైకిల్‌, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి
ప్రమాదంలో గాయపడిన జల్ల రాములు, నర్సింలు

నాగిరెడ్డిపేట, డిసెంబరు 18: నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్‌ గేట్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం సైకిల్‌, బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే మండలంలోని తాండూర్‌ గ్రామానికి చెందిన చాకలి నర్సింలు తన సైకిల్‌పై కట్టెలు కట్టుకుని తాండూర్‌ గ్రామానికి వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన జల్ల రాములు మోటార్‌ సైకిల్‌పై మండల కేంద్రం నుంచి తాండూర్‌కు వస్తుండగా తాండూర్‌ గేట్‌ సమీపంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం చారి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ పోలీస్‌ వాహనంలో చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా జల్ల రాములు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం చారి వివరించారు.


Read more