గురుకుల పాఠశాలలో సాంస్కృతిక పోటీలు
ABN , First Publish Date - 2020-12-20T04:53:40+05:30 IST
మండలంలోని అ చ్చంపేట బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఈ నెల 20న ఆదివారం సాహిత్యం, సాంస్కృతిక పోటీ లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు.

నిజాంసాగర్, డిసెంబరు 19: మండలంలోని అ చ్చంపేట బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఈ నెల 20న ఆదివారం సాహిత్యం, సాంస్కృతిక పోటీ లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, జిల్లా పరిషత్, ఇతర గురుకుల, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 19వ తేదిన సాయంత్రం 4 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. విజేతలకు బహుమతుల ప్రధానం చేస్తారని, వివరాలకు వైస్ ప్రిన్సిపాల్ 6304172993 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.