బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌లపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2020-04-15T05:52:53+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ

బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌లపై క్రిమినల్‌ కేసు

బోధన్‌, ఏప్రిల్‌ 14 : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాకేష్‌గౌడ్‌ తెలిపారు. బోధన్‌ పట్టణంలోని అంబే ద్కర్‌ చౌరస్తాలో మంగళవారం అంబేద్కర్‌ జయంతి నిర్వహించారన్నారు.


ఇందులో పాల్గొన్న వారంతా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడం తోపాటు భౌతిక దూరం పా టించలేదని తెలిపారు. దీంతో చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, గుణప్రసాద్‌, రాధాకృష్ణ, డబ్బు, మాసిని వినోద్‌, దాము, కొండ్ర పద్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్లం, సింగిల్‌ విండో చైర్మన్‌ గిర్దావర్‌ గంగారెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు విద్యాసాగర్‌, మోచి శంకర్‌, బెంజర్‌ గంగారాం, బీజే పీ పట్టణ అధ్యక్షుడు బాల్‌రాజ్‌, కె.వాసు, కొండ్ర వెంకటి, బొర్రోల్ల కృష్ణ, చిన్న, మరికొంత మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-04-15T05:52:53+05:30 IST