లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించొద్దు: సీపీ కార్తికేయ

ABN , First Publish Date - 2020-05-10T11:25:57+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ కార్తికేయ హెచ్చరించా రు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించొద్దు: సీపీ కార్తికేయ

ఖిల్లా, మే 9: జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ కార్తికేయ హెచ్చరించారు. అత్యవసరముంటేనే బయటకు రావాలన్నారు. అనుమతి లేకుండా వాహనాలతో వస్తే సీజ్‌ చేయడంతో పాటు  కేసు లు నమోదు చేస్తామన్నారు. ఈనెల 29 వరకు ప్రజలం తా స్వీయనిర్బంధంలో ఉండాలన్నారు. రాత్రి 7 గంట ల నుంచి ఉదయం 6 గంటల వరకు జిల్లాలో కర్ఫ్యూ ఉంటుందని ఎవరూ బయటకు రావద్ద ని ఆయన కోరారు. అత్యవసర మెడికల్‌ అవసరాల కోసం పోలీసు శాఖ తరఫున పాస్‌లు అందజేస్తున్నామన్నారు. సం బంధిత ఏసీపీలను కలిసి తీసుకో వాలని కోరారు. ప్రజలకు ఎలాం టి సమాచారమైనా కావాల నుకుంటే డయల్‌ 100కు ఫోన్‌చేసి తెలుసుకోవాలన్నారు. అత్యవస రం పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చేయాలన్నారు. 

Updated Date - 2020-05-10T11:25:57+05:30 IST