కరస్పాండెంట్ హల్‌చల్
ABN , First Publish Date - 2020-03-16T10:27:09+05:30 IST
శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల సంద ర్భంగా నగరంలోని వర్నిరోడ్‌లో గల విశ్వశాంతి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పరీక్ష కేంద్రం వద్ద హల్‌చల్
ఇంటర్ పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించని వైనం
కరస్పాండెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటర్ బోర్డు
నిజామాబాద్ అర్బన్, మార్చి 15: శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల సంద ర్భంగా నగరంలోని వర్నిరోడ్‌లో గల విశ్వశాంతి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పరీక్ష కేంద్రం వద్ద హల్‌చల్ చేయడం జిల్లాలో చ ర్చనీయాంశమైంది. పరీక్ష కేంద్రంలోకి విద్యా ర్థులను అనుమతించకుండా అడ్డుకోవడంపై జిల్లాలోని ఇంటర్ బోర్డు పోలీసులు, ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
శుక్రవారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షల్లో విశ్వశాంతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ వెళ్లిన సందర్భంగా విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఇన్విజిలేటర్‌లు స్క్వాడ్ దృ ష్టికి తేగా స్క్వాడ్ విద్యార్థులను కొట్టి మంద లించి వదిలివేయడంపై సదరు కరస్పాండెం ట్ అభ్యంతరం వ్యక్తం చేసి స్క్వాడ్‌పై పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి జీవితం నాశనమవుతుందనే ఉద్దేశ్యంతో స్క్వాడ్ రెం డు దెబ్బలు వేసి వదిలవేయగా విద్యార్థుల ను కొట్టడం ఏమిటని అవసరమైతే డిబార్ చేయాలని కొడితే తమ కళాశాలకు చెడ్డపేరు వస్తుందని సదరు కరస్పాండెంట్ నానా హంగామా చేశాడు.
శనివారం విద్యార్థులను పరీ క్ష కేంద్రంలోకి వెళ్లనీయకుండా సుమారు అర గంట పాటు గేటు ముందు హల్‌చల్ చేసిన ట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఇంట ర్మీడియట్ అధికారి అడిషనల్ కలెక్టర్‌కు ఫి ర్యాదు చేయగా కళాశాలకు వచ్చే యేడాది ప రీక్ష కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆలోచ నలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగే పరీక్షను సైతం సదరు కరస్పాండెంట్ అడ్డు కుంటే ఆయనను అరెస్ట్ చేసే విషయంలో ఇంటర్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు తెలుస్తోంది.
ఒక కళాశాల వి ద్యార్థులు ఆ కళాశాల సెంటర్‌లో పరీక్ష రాస్తు న్నందు వల్లే వారిని డిబార్ చేయాలని సద రు కరస్పాండెంట్ స్క్వాడ్‌లకు చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కళాశాలల మధ్య విభే దాలుంటే వారువారు చూసుకోవాలే తప్ప వి ద్యార్థుల జీవితాలతో ఆటలాడడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతు న్నా రు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జ రుగుతున్న సమయంలో నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. సదరు క ళాశాలను పరీక్ష కేంద్రాల బ్లాక్‌లిస్టులో పెట్ట డంతో పాటు కళాశాల గుర్తింపు రద్దుపై ఫి ర్యాదు చేయనున్నట్లు సమాచారం.