కరోనాపై ప్రతీరోజు పర్యవేక్షణ జరపాలి

ABN , First Publish Date - 2020-03-18T11:38:14+05:30 IST

కరోనా వైరస్‌ విషయంలో భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు

కరోనాపై ప్రతీరోజు పర్యవేక్షణ జరపాలి

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 17: కరోనా వైరస్‌ విషయంలో భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, అవగాహనతో దానిని కట్టడి చేసేందుకు వీలు కలుగుతుందని కలెక్ట ర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కరోనా వైరస్‌పై ముంద స్తు చర్యలు, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరే ట్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలకు ప లు ఆదేశాలు జారీచేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చిన వారు రెండు వారాలు ఇంట్లోనే ఉంచేలా కుటుంబసభ్యులకు అవ గాహన కల్పించాలన్నారు. చైనా, ఇటలీ తదితర దేశా ల్లో ఈ వ్యాధి మొదటి స్టేజ్‌ను దాటి ప్రమాదకరంగా మారిందని మన దేశంలో ఇంకా మొదటి స్టేజీలోనే ఉ న్నందున కట్టడి చేయాల్సిన అవసరముందన్నారు. మన దేశంలో విదేశాల నుంచి  వచ్చిన వారికి మాత్ర మే ఈ వైరస్‌ సోకిందని ఆయనన్నారు. విదేశాల నుం చి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ప ధ్నాలుగు రోజుల పాటు ఇళ్లలోనే ఉంచాలని, ఇది ప్రా థమికంగా బయటపడక పోయినప్పటికీ ఒకవేళ ఉం టే కొద్దిమందిలో పధ్నాలుగు రోజులల్లో ఎప్పుడైనా బ యటపడే అవకాశం ఉన్నందున వారిని తప్పనిసరిగా ఇళ్లలో వేరుగా, జాగ్రత్తలు పాటిస్తూ ఉండే విధంగా కుటుంబసభ్యులు, అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. 


వారిలో ఎవరికైనా దగ్గు, గొంతునొప్పి, జలు బు, జ్వరం, శ్వాససంబంధమైన సమస్య ఉన్నట్లయితే తప్పనిసరిగా పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. విదేశాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వా రి విషయంలో గ్రామ, మండల స్థాయి కమిటీలు పరీ క్షలు చేయించడంతోపాటు వేరుగా ఉండే విధంగా ప కడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.  ఎవరైనా సూచన లు పాటించకుంటే బలవంతంగానైనా హోం ఐసోలే షన్‌లో ఉంచాలని, ఇందుకు మండలస్థాయిలో వైద్య శాఖాధికారులతోపాటు పోలీసు అధికారులు, తహసీ ల్దార్లు సహకరించాలన్నారు.


వైద్యులు నిర్ణీత సమ యంలో మాత్రమే కాకుండా ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల పందొమ్మిదో తేదీనుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధితాధికా రులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎక్కడా కూడా మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కఠినంగా వ్యవహ రించాలని, పరీక్షా సమయంలో సంబంధిత కేంద్రాల వద్ద జిరాక్స్‌ కేంద్రాలను మూసి ఉంచాలన్నారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీసీపీ రఘువీర్‌, అదనపు కలెక్టర్లు లత, చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో సుదర్శన్‌, డీఆర్‌డీవో రమేష్‌, డీఈవో జనార్ధన్‌రావు త దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T11:38:14+05:30 IST