కామారెడ్డిలో కరోనా కలకలం!

ABN , First Publish Date - 2020-03-04T11:09:35+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంర దంలో ఓవ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడ ంతో అనుమానించిన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు అతడిని చికిత్స నిమిత్తం...

కామారెడ్డిలో కరోనా కలకలం!

దుబాయి నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలున్నట్టు అనుమానం

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షణాల గుర్తింపు

చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలింపు

బాధితుడు నిజామాబాద్‌ జిల్లా వాసి 


కామారెడ్డిటౌన్‌, మార్చి3: కామారెడ్డి జిల్లా కేంర దంలో ఓవ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడ ంతో అనుమానించిన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యులు అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆ సుపత్రికి మంగళవారం తరలించారు. నిజామా బాద్‌ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత 15 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి స్వ గ్రామానికి వచ్చాడు. అయితే అతనికి తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు వస్తుండడంతో.. ఇటీ వలే కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసు పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు అతనిని పరీక్షించి అనుమానిత కరోనా వైరస్‌ ల క్షణాలుగా గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం గాం ధీ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేం ద్రంలో కరోనా వైరస్‌ బాధితులను గుర్తించేందుకు, ప్రత్యేక చికిత్సలు అందించడానికి ప్రత్యేకంగా కేం ద్రాన్ని ఏర్పాటుచేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుప త్రిలో చికిత్స చేయకుండా హైదరాబాద్‌ గాంధీ ఆ సుపత్రికి రిఫర్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కామారెడ్డి ప్ర భుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ ను వివరణ కోర గా.. కరోనా ఛాయలు గల వ్యక్తు లు ఎవరూ తమ వద్దకు రాలేదన్నారు. అలాంటి సమాచారం తమకు లేదని తెలిపారు.


Updated Date - 2020-03-04T11:09:35+05:30 IST