కరోనాపై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-03-18T11:51:51+05:30 IST

కరోనా వ్యాధిపై అవగా హన కల్పించడంతో పాటు వైరస్‌ నివారణ కు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

కరోనాపై అప్రమత్తం

గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు

ముగ్గురిని జిల్లా ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు

కరోనా ప్రభావంతో 21నుంచి మార్కెట్‌ యార్డు మూసివేత

తగ్గిన జనసామర్థ్యం, మాస్కులు, శానిటైజర్‌లకు డిమాండ్‌


నిజామాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా వ్యాధిపై అవగా హన కల్పించడంతో పాటు వైరస్‌ నివారణ కు  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే వివరాల ఆధా రంగా జిల్లా వ్యాప్తంగా గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారి వివరాలను సేకరిస్తుంది. ఆ గ్రామాలకు వెళ్లి జిల్లా యంత్రాంగం నియ మించిన మండల అఽధికారుల టీం వారిని అడిగి వివరాలు తెలుసుకుంటుంది. అను మానితులు ఉంటే జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లను చే స్తున్నారు. జిల్లాలోని గల్ఫ్‌ వెళ్లే మండలాల పైన దృష్టి పెట్టి చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా మండల స్థాయిలోని వైద్య, రెవెన్యూ, పం చాయతీరాజ్‌తో పాటు పోలీసు, ఇతర శాఖ ల అదికారులు పాల్గొని నిర్ధారణకు వస్తు న్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై న అవగాహన కలిగించేందుకు జి ల్లా యంత్రాంగం చర్యలు చేప ట్టింది.


గ్రామాల్లో వివిధ శాఖ ల ద్వారా అవగాహన కల్పి స్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సి న చర్యలను వివరిస్తున్నా రు. ప్రత్యేకమైన  కార్యక్ర మాలను చేపడుతూ అప్ర మత్తం చేస్తున్నారు. గల్ఫ్‌ నుంచి ఈ మధ్యన వచ్చిన వారి వివరా లను సేకరిస్తున్నారు. గల్ఫ్‌తో పాటు ఇటలీ, బ్రిటన్‌, హంగ్‌కాంగ్‌, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప రిశీలిస్తున్నారు. వారు ఎప్పుడు వచ్చారో వి వరాలను సేకరిస్తూ అప్రమత్తంగా ఉండా లని కోరుతున్నారు. జిల్లాలో మంగళవారం నందిపేట్‌, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్‌, ఎడపల్లి, డిచ్‌పల్లి మండలాల పరిధిలో ప రిశీలన జరిపారు. తగు చర్యలను తీసుకుం టున్నారు. కరోనా వ్యాప్తిచెందకుండా చేప ట్టవలసిన చర్యలను వారికి వివరిస్తున్నా రు. ఎడపల్లి, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి మండ లాలకు చెందిన ముగ్గురిని జిల్లా కరోనా వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. వారి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరిశీలి స్తున్నారు. పరీక్షల తర్వాత వారికి వ్యాధి సోకిందా లేదా అని నిర్ధారణకు వస్తామని వైద్యాధికారులు తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమాలను చేస్తు న్నారు. కరోనా ప్రభావంతో 21 నుంచి  మార్కెట్‌ యార్డును మూసివేయనున్నారు. ధాన్యంతో పాటు పసుపు అమ్మకాలను నిలిపివేస్తారు. మార్కెట్‌కు భారీగా ప్రతిరోజు వందలాది మంది రై తులు వస్తుండడంతో ఈ నిర్ణ యం తీసుకున్నారు. మళ్లీ ప్ర భుత్వం ఆంక్షలు సడలించి న తర్వాతనే కొనుగోలు  మొదలుపెట్టనున్నారు. జి ల్లా వ్యాప్తంగా పాఠశాల లు, కళాశాలలను మూసి వేశారు. జిల్లాలో కేవలం ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహిస్తున్నా రు. టెన్త్‌కు ఏర్పాట్లను చేస్తున్నారు. సిని మా హాళ్లను పూర్తిగా మూసివేశారు. ఫంక్ష న్‌ హాళ్లకు కూడా అనుమతులను రద్దుచే శారు. బహిరంగ సమావేశాలకు పోలీసు లు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆ దేశాలకు అనుగుణంగా పూర్తిస్తాయి చర్య లను చేపడుతున్నారు. బస్సుల్లో కూడా కరో నా వైరస్‌ వ్యాప్తిపైన  అవగాహన కల్పిస్తు న్నారు. శానిటైజర్‌లను అందుబాటులో ఉం చుతున్నారు. ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించడం, పార్కులతో పాటు అన్ని  మూసివేయడంతో వ్యాపారాలు కూ డా అంతగా కొనసాగడం లేదు. కరోనా ప్ర భావం వ్యాపారంపైన కూడా కనిపిస్తుంది. మాల్స్‌కు వెళ్లేవారు కూడా తగ్గిపోయారు. అవసరముంటే చిన్న షాపులు, సూపర్‌బ జార్‌లలో మాత్రం కొనుగోలు చేస్తున్నారు.


కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శానిటైజర్‌లు, మాస్కుల కొనుగోలు భారీగా పెరిగింది. వీటితో పాటు సబ్బుల వినియో గం కూడా పెరిగింది. వైద్యులతో పాటు ఇతర సంస్థలు అప్రమత్తం చేస్తుండడంతో ఎక్కువగా మాస్కులను వినియోగిస్తున్నా రు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కొద్దిరోజులు వైద్యాధికారులతో సమీక్షించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి అధికారు లతో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశా లిస్తున్నారు. పూర్తిస్థాయి చర్యలు చేపట్టాల ని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అ నుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా కరోనా ప్రభావం జిల్లా వ్యాప్తం గా కనిపిస్తోంది. జనసమ్మర్ధం కూడా తగ్గి పోయింది. కరోనా  వైరస్‌ పట్ల ప్రభుత్వ ఆ దేశాలకు అనుగుణంగా పూర్తి చర్యలను చే పడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారులు తెలిపారు. మొత్తంగా ప్రభుత్వం సెలవులు ప్రకటిం చడం వివిధ శాఖలతో పాటు సంస్థలు బ హుళ ప్రచారం చేయడంతో జిల్లా ప్రజలు అప్రమత్తం అయ్యారు.

Updated Date - 2020-03-18T11:51:51+05:30 IST