ఇద్దరికి కరోనా లక్షణాలు.. గాంధీకి రిఫర్..
ABN , First Publish Date - 2020-03-25T16:09:57+05:30 IST
జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వారిని వైద్యులు రిఫ ర్ చేసినట్లు సమాచారం.

కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వారిని వైద్యులు రిఫ ర్ చేసినట్లు సమాచారం. తాడ్వాయి మండలానికి చెందిన ఒక్కరు దుబాయి నుంచి రాగా తీవ్ర దగ్గు, జ్వరం, అదే మం డలానికి చెందిన మరో వ్యక్తి సౌదీ అరేబియా నుంచి రాగా ఆయనకు సైతం తీవ్ర దగ్గుతో బాధపడుతుండడంతో ఆయా పీహెచ్‌సీ పరిధిలో వైద్యసిబ్బంది కామారెడ్డి ఐసోలేషన్‌కు పంపించగా వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి హైదరా బాద్ గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు సమాచారం. కాగా కామారెడ్డి పట్టణంలో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూ చించిన వారు ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రోగ్రాం అధి కారి కరుణశ్రీ పరిశీలించడంతో పాటు కరోనా వైరస్ ఏ విఽ దంగా వ్యాప్తి చెందుతున్నదే వివరిస్తూ ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. పట్టణంలోని 41వ వార్డులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని కాలనీవాసులు వైద్యసిబ్బంది దృష్టికి తీసుకుపోగా మెడికల్ ఆఫీసర్ సుజాయత్ ఆధ్వర్యం లో ఆ వ్యక్తిని పరిశీలించి వైద్యచికిత్సల నిమిత్తం ఆసుపత్రికి రావాలని సూచించారు. కార్యక్రమంలో సంజీవ్‌రెడ్డి, వేణుగోపాల్,రాణి ఆశాలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.