భయం.. భయం

ABN , First Publish Date - 2020-07-19T08:13:33+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు భ యం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధులు..

భయం.. భయం

  • జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ఉధృతి
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జంకుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు
  • ఆయా ప్రభుత్వశాఖల వారీగా కార్యాలయాల్లో ప్రత్యేక ఫిర్యాదు బాక్సుల ఏర్పాట్లు


నిజామాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కరోనా ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు భ యం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కా ర్యక్రమాలల్లో పాల్గొనేందుకు జంకుతున్నారు. ప్రభుత్త అధికారులకు, ప్ర జాప్రతినిధులకు కరోనా వైరస్‌ సోకుతుండడంతో ఆందోళన చెందుతున్నా రు. ఎక్కడికక్కడా కార్యాలయాలల్లో కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యలయాలకు వచ్చే వారి కో సం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. ఆందోళన నడుమ విధులను నిర్వర్తిస్తూ వారికి అప్పగించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు.


జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. జిల్లాలో గడిచిన నెల రో జులుగా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిజామాబాద్‌ నగరంలో ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 356 కేసులు నమో దు కాగా సుమారు 120 మంది డిశ్చార్జి అయ్యారు. మిగతా వారు వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 18మంది మృతిచెందారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, డివిజన్‌లలో కరోనా పాజిటి వ్‌ కేసులు నమోదవుతున్నాయి. హరితాహారం, గ్రామ ప్రగతితోపాటు ఇ తర ప్రభుత్వ కార్యక్రమాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరం గా పాల్గొంటున్నారు.


 కరోనా ఉధృతి మధ్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినితులకు క రోనా వైరస్‌ సోకింది. ప్రజాప్రతినిధులు స్వీయనియంత్రణ పాటించినా ప్రభుత్వ కార్యకలాపాలల్లో పాల్గొనే సమయంలో ఈ పరిస్థితి వస్తోంది. వీరితోపాటు నిత్యం సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది కూడా కరోనా వైరస్‌ భారినపడి వివిఽధ ఆసు పత్రులల్లో చికిత్స పొందుతున్నారు. బోధన్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న వై ద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌లకు కొవిడ్‌-19 వ్యాధి భారిన పడడం తో బోధన్‌ ఆసుపత్రిలో తాత్కాలిక సేవలను నిలిపివేశారు. నిత్యం రోడ్లపై విధులను నిర్వహించే పోలీస్‌ శాఖ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. న గరంతోపాటు ఇతర ప్రాంతాలల్లో పనిచేస్తున్న పోలీసులు పరీక్షలు చే యించుకోవడంతో పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌, జిల్లా ఆసుపత్రుల ల్లో చికిత్స పొందుతున్నారు.


 జిల్లా కలెక్టరేట్‌లో నిత్యం ఫిర్యాదుల కోసం జిల్లా నలుమూలల నుంచి వస్తారు. సోమవారం ఎక్కువగా రావడంతో క ట్టడి చేయడం కష్టంగా మారింది. కలెక్టరేట్‌ అధికారులు పోలీసు అవుట్‌ పోస్టు పరిధిలో ఫిర్యాదుల బాక్సు పెట్టి అందులో వేయిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా ఎవ్వరిని కలువనివ్వడం లేదు. ఎక్కువ మంది రావ డంతో నిర్ణయం తీసుకున్నారు. బోధన్‌ ఆర్డీవో పరిధిలోనూ ఇవే ఏర్పాట్లను చేశారు. ఆర్మూర్‌  ఆర్డీవో కార్యాలయం వద్ద, మున్సిపాలిటిల్లోనూ ఇదే విధమైన పద్ధతిని పాటిస్తున్నారు. గ్రామాలల్లో ఇదివరకు కేసులు తక్కువ గా ఉన్నా.. ఈ మధ్య పెరగుతుండ టం తో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నా రు. కొత్తవారు గ్రామాల్లోకి రాకుండా చూస్తున్నారు. ఎవరైనా వస్తే సర్పంచ్‌, కార్యదర్శి, వీ డీసీ సభ్యులు వివరాలు తీసుకుంటున్నారు. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇదేవిధమైన ఏర్పాట్లను చేశా రు. అవసరమైతే ఏవోను కలిసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. ఎక్కడిక క్కడాకట్టడి చేస్తేనే పరిస్థితి మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-19T08:13:33+05:30 IST