భయం.. భయం
ABN , First Publish Date - 2020-07-08T09:33:08+05:30 IST
జిల్లా వాసులపై కరోనా కాటేస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ఎవ రు మృతి చెందిన సంఘటనలు లేవు.

కరోనాతో బాన్సువాడ వాసి హైదరాబాద్‌లో మృతి
డెత్ సర్టిఫికెట్లో పొందుపరిచిన ప్రైవేట్ వైద్యులు
ధ్రువీకరించని జిల్లా వైద్యఆరోగ్యశాఖ
జిల్లాలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 17 పాజిటివ్ కేసులు
కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా కలకలం
విద్యాశాఖలో ఓ విభాగ అఽధికారికి కరోనా పాజిటివ్
పిట్లం వైద్యాధికారికి.. గాంధారి బ్యాంక్ అధికారికి సోకిన వైరస్
సెంచరీకి చేరువలో కరోనా కేసులు
జిల్లాలో ఇప్పటి వరకు 97 కేసుల నమోదు
కామారెడ్డి, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లా వాసులపై కరోనా కాటేస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ఎవ రు మృతి చెందిన సంఘటనలు లేవు. కానీ అనారోగ్యకార ణంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాన్సువా డ వాసి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. కరోనా లక్షణాలు ఉండడం, గుండె పోటుతో మృతి చెందడంతో ఆ ఆసుపత్రి వైద్యులు కరోనాతో మృతి చెందిన ట్లు డెత్ సర్టిఫికెట్లో పొందుపర్చారు. దీంతో జిల్లాలో కరో నా వైరస్ వల్ల మృతి చెందిన తొలి మరణం కేసు నమోద యింది. ఈ విషయాన్ని మాత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. జిల్లాలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 17 పాజిటివ్ కేసులు నమోద య్యాయి.
గత నాలుగు నెలల నుంచి జిల్లాలో రెండు, మూడు కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చాయి. కానీ ఏకంగా 17 కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులలో కలెక్టరేట్లోని విద్యాశాఖలో ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టరేట్ అధికారుల్లో, ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యాధి కారికి పాజిటివ్ నిర్ధారణ కావడం, అదేవిధంగా గాంధా రిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌కు కరోనా సోకడంతో బ్యాంక్‌ను మూసివేశారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలపై కరోనా విరుచుకుపడుతుండడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంటుంది.
హైదరాబాద్‌లో బాన్సువాడ వాసి మృతి
బాన్సువాడ పట్టణంలో మార్కజ్ వెళ్లి వచ్చిన వారితో 11 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో పట్టణంలో పకడ్బందీగా కట్టడి చేయడ ంతో వైరస్‌ను నిర్మూలించగలిగారు. ఈ కేసుల నుంచి ఇప్పుడిప్పుడే బాన్సువాడ వాసులు తెలుకుంటున్న సమయ ంలో కరోనా తొలి మరణం కూడా అక్కడే చోటు చేసుకోవ డం పట్టణ వాసుల్లో మరింత కలకలం రేపుతోంది. బాన్సు వాడ పట్టణంలోని చైతన్యకాలనీలో నివాసం ఉండే ఓ వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతుండగా ఆ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేయగా బాధితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మంగ ళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
మృతిడికి కరోనా లక్షణాలు ఉన్నాయని గుండెపోటుతో మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి వైద్యులు డెత్ సర్టిఫికేట్లో పొందుపరిచారు. కరోనాతోనే మృతి చెందినట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నా యి. కానీ ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా వైద్యఆరోగ్య శాఖ అఽధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని సమాధానం ఇచ్చారు. ఈ మృతదేహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా వారే దహన సంస్కారాలు హైదరాబాద్‌లోనే నిర్వహి ంచారు.
ఒకే రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
జిల్లాలో సోమవారం 5 గంటల నుంచి మంగళవారం 5 గంటల వరకు మొత్తం 17 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధా రణ అయినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. వీటిలో ఓ కేసు మైగ్రెంట్గా గుర్తిం చడం జరిగిందన్నారు. గత 4 నెలల నుంచి జిల్లాలో ఒక్కటి లేదా నాలుగు చొప్పున కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ మంగ ళవారం మొత్తం 92 రక్త నమూనాల ఫలితాలు రాగా ఇందులో 75 నెగిటి వ్గా తేలింది. ఒకే రోజు 17 కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. పెద్ద కొడప్గల్లో 4, కామారెడ్డిలో 4, బిచ్కుందలో 2, మద్నూర్‌లో మూడు, గాంధారిలో 1, బాన్సువాడలో 2, పిట్లంలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు వరకు మొత్తం 97 పాజిటివ్ కేసులు నమో దయ్యాయి. ఇందులో 13 మంది వలసదారులు ఉండగా, ముంబైకి చెందినవారు 5 గురు, హైదరాబాద్ కు చెందిన వారు 6 గురు, నాందేడ్, వర్ని నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరో 40 మంది రక్తనమూనాల పరీక్షలు రావాల్సి ఉంది.
కలెక్టరేట్లో కరోనా కలకలం
ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులను, వ్యాపారవేత్తలను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా కలెక్టరేట్ కార్యాల యంలోని విద్యాశాఖలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టరేట్లో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పాలనాధికా రితో పాటు 40 శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సుమారు 2 వేలకు పైగా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి కలెక్టరేట్లోనే ఉన్న విద్యాశాఖ లో ఓ కీలక విభాగానికి అధికారిగా ఉన్న వ్యక్తికి మంగళ వారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి కలెక్టరేట్లోని ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
సదరు వ్యక్తికి పాజిటివ్ రావడంతో కలెక్టరేట్లోని అధికారుల్లో, ఉద్యోగు లలో ఆందోళన నెలకొంటుంది. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న అధికారులు, ఉద్యోగులు కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ ఆసుపత్రులకు పరుగులు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గాంధారి మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంక్‌లో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ మేనే జర్కు పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాంకు పనులను నిలిపివేసి మూసివే శారు. అదేవిధంగా మహారాష్ట్రలోని దెగ్లూర్లో నివాసం ఉండే ఓ వైద్యుడు పిట్లంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధు లు నిర్వర్తిస్తుంటాడు. ఈ వైద్యుడికి సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి ంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖలో నూ తోటి వైద్యులతో పాటు సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంటుంది.
సెంచరీకి చేరువలో..
జిల్లాలో కరోనా కేసులు రోజురోజు కూ పెరుగుతున్నాయి. వైరస్ జిల్లా ప్రజలపై విరుచుకుపడుతోంది. తొలి కరోనా మరణం కేసు నమోదు కావ డం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో తాజాగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 17 కేసులు నమోదు కావడం చూస్తే కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తుందో అర్థం చేసుకోవ చ్చు. జిల్లాలో కరోనా కేసులు సెంచరీకి చెరువలో ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 97 కరోనా కేసులు నమోదయ్యా యి. లాక్డౌన్ మూడు నెలల కాలంలో 12 కేసులకే పరిమి తం కాగా అన్‌లాక్ తర్వాత జిల్లాలో నెల వ్యవధిలోనే 84 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇందులో కామారెడ్డి పట్టణ పరిధిలోనే అత్యధికంగా 45 కేసులు నమోదయ్యా యి. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కానీ మండలాలు రామారెడ్డి, నస్రూల్లాబాద్, బీర్కూర్, నిజాంసాగర్, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, దోమకొండ ఉన్నా యి. మిగతా అన్ని మండలాల్లో కరోనా కేసులు నమోద య్యాయి. తొలుత బాన్సువాడ, కామారెడ్డి పట్టణాలకే పరి మితమైన కరోనా దాదాపు అన్ని మండలాల్లోని మారుమూ ల గ్రామంలోనూ వైరస్ విస్తరించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.