కరోనా..విజృంభణ!

ABN , First Publish Date - 2020-06-16T11:04:44+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌, ముంబై కాంటాక్ట్‌లతో ఈ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వ్యక్తులకు

కరోనా..విజృంభణ!

జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల 

వారి కార్యక్రమాలకు హాజరైన వారిని హోంక్వారంటైన్‌లో ఉంచిన అధికారులు 

కరోనా చికిత్సకు జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాట్లు

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్‌  


నిజామాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌, ముంబై కాంటాక్ట్‌లతో ఈ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వ్యక్తులకు కరోనా రాగా.. తాజాగా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌గుప్తాలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎమ్మెల్యేలైన వీరిద్దరికి కరోనా సోకడంతో వారిని కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. అధికారులు సూచనలతో వారు హోంక్వారంటైన్‌లో ఉండగా మిగతా వారిని గుర్తించే కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమాల ఆధారంగా వారిని గుర్తిస్తూ హోం క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అవసరమైన వారికి చికిత్స అందించే  ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 15 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌గుప్తాలతో పాటు ఇతరులకు కరోనా వచ్చింది. గడిచిన పదిహేను రోజుల్లోనే సుమారు 19 వరకు కేసులు పెరిగాయి. వీరిలో ఒక మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా.. మిగతా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఒకేసారి కేసులు పెరగడంతో ప్రజల్లో ఆం దోళన మొదలైంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆంక్షలు ఉండ డం వల్ల ఢిల్లీలోని మర్కజ్‌ వెళ్లివచ్చిన వారి ద్వారా 61 కేసు లు వచ్చినా వ్యాప్తి మాత్రం తక్కువగా ఉంది.


తర్వాత నెల రోజుల  పాటు ఎలాంటి కరోనా కేసులు బయటపడకున్నా ప్రస్తుతం ఒకేసారి పెరిగాయి. జిల్లాకు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలకు ఒకేసారి బయటపడడంతో ఆందోళన మొదలైం ది. ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఆదివారం కరోనా పాజటివ్‌ రాగా సోమవారం ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాకు వచ్చింది. వీరిద్దరూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లాకు చెం దిన ఇతరులు కూడా హైదరాబాద్‌లోని గాంధీతో పాటు యశోద, సన్‌శైన్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు. వారిని 14 రో జుల పాటు బయటకు రా వద్దని కోరారు. ఇంకా కొ ందరిని గుర్తించే ప్ర యత్నం చేస్తున్నారు. హోంక్వారంటైన్‌  అ యిన వారిలో ఎమ్మె ల్మే బాజిరెడ్డి కుటు ంబసభ్యులతో పా టు ఎమ్మెల్సీ వీజీగౌ డ్‌, ఆర్డీవో, తహసీల్దా ర్‌ ఇతర అధికారులు ఉన్నారు.


వీరితో పాటు కా ర్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ పీలు, జడ్పీటీసీలు, ఇతర నేతల ను కూడా హోంక్వారంటైన్‌లో ఉంచా రు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా కూడా శనివారం కార్యక్రమంలో పాల్గొనండంతో వారిని కూడా గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొనండంతో వారిని ఇల్లు కదిలి బ యటకు రావద్దని కోరారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఆ దివారం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన కూడా ఎ మ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజటివ్‌ వచ్చిన విషయం తెలుసుకొని వెంటనే కార్యక్రమాలు వాయిదా వేసుకొని హైదరాబాద్‌ వెళ్లారు. ప్రస్తుతం ఆయన కూడా ఫోన్‌ల ద్వారానే ని యోజకవర్గంలోని కార్యకర్తలకు అందుబాటులో ఉండేవిధం గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం మోర్తాడ్‌కు చెందిన ఒక వ్యక్తికి కూడా కరోనా పాజటివ్‌ వ చ్చింది. దీంతో ఆయన ఎవరెవరిని కలిశారో గుర్తించి వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. 


అప్రమత్తమైన అధికారులు..

జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర  ఏర్పాట్లు కూడా చేస్తున్నా రు. ప్రజలు కరోనా పట్ల అప్ర మత్తంగా ఉండాలని కోరుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భౌతిక దూ రం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని కో రుతున్నారు. కరోనా వర్షాకాల ంలో విజృంభించే అవకాశం ఉ ండడంతో జిల్లా జనరల్‌ ఆసుపత్రిని కూడా సిద్ధం చేస్తున్నారు. 200 పడకలతో వార్డులను ఏర్పాటు చే శారు. ఐసోలేషన్‌ వార్డుతో పాటు ఐసీ యూను కూడా ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల ల్యాబ్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఒకటి, రెండు రోజు ల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏర్పాట్లు చే శారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే జిల్లాకు చెందిన కరోనా పాజిటివ్‌ వచ్చిన వా రికి జనరల్‌ ఆసుపత్రిలోనే చికిత్స అందించనున్నారు.


కరోనా ల్యాబ్‌కు అనుమతి ఇవ్వగానే రోజుకు 300 మందికి రక్తనమూనాల పరీక్షలు ఆసుపత్రిలోనే చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జనరల్‌ ఆసుపత్రిలో ఉన్న సాధారణ రో గుల వార్డులను పాత భవనంలోకి మార్చారు. గైనకాలజీ వార్డును వేరే భనంలోకి షిప్ట్‌ చేస్తున్నారు. కేవలం కరోనా కే సులను ప్రధాన భవనంలో చికిత్స అందించే విధంగా ఏర్పా ట్లు చేస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రభుత్వం ను ంచి ఆదేశాలు రాగానే చికిత్స అందిస్తామని తెలిపారు. 


ప్రజలు జాగ్రత్త వహించాలి..కలెక్టర్‌ నారాయణరెడ్డి

జిల్లా ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. కరోనా ఏ రూపకంగానైనా రావచ్చన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 7,500 మంది జిల్లాకు వచ్చారన్నారు.  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన కో రారు.  వర్షాలవల్ల ఇంకా పెరి గే అవకాశం ఉన్నందున భౌతిక దూరం పాటించడంతో పాటు  చేతు లు కడగడంతో పా టు శానిటైజర్‌లు ఉపయోగించాలన్నారు. 


బాజిరెడ్డిని కలిసిన వారు హోంక్వారంటైన్‌కు

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఈనెల 13న శనివారం కలిసిన వారందరినీ హోంక్వారంటైన్‌ కు తరలించారు. రూరల్‌ మండలానికి చెందిన గుండారం, శాస్ర్తీనగర్‌, రాంనగర్‌, ఖానాపూర్‌ గ్రామాలకు చెందిన 14 మందికి ఎమ్మెల్యే షాదీము బారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. రూరల్‌ ఎంపీపీ అనూష, జడ్పీటీసీ సుమలతతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్‌లు, కార్యకర్తలు దాదాపు 50 మంది వరకు బాజిరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వీరందరికి రూరల్‌ మండలం డాక్టర్‌లు పరీక్షలు నిర్వహించారు. అందరినీ హోంక్వారంటైన్‌ లో ఉంచారు. ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే సంప్రదించాలని తెలిపారు. 


కరోనా బాధితురాలి మృతి

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందింది. చెందిన మహిళ కుటుంబ తగాదాలతో మే 24న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో గా యాల పాలయింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లో ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా సోమవారం మృతిచెందింది. మృతదేహాన్ని సోమవారం నేరుగా గ్రామంలోని శ్మశానవాటికకు  తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్‌ సీఐ రఘునాథ్‌, ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ గ్రామస్థులతో మాట్లాడి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Updated Date - 2020-06-16T11:04:44+05:30 IST