స్వీయ నిర్బంధంతోనే.. కరోనాకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2020-03-25T16:15:09+05:30 IST
జిల్లా వాసులు తమకు తాముగా స్వీయ నిర్బంధంలో ఉండడం ద్వారానే కరో నా వైరస్‌ను అడ్డుకోవచ్చని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కామా రెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఐసోలేషన్, ఐసీయూ

కామారెడ్డి టౌన్, ఎల్లారెడ్డి టౌన్, దోమకొండ: జిల్లా వాసులు తమకు తాముగా స్వీయ నిర్బంధంలో ఉండడం ద్వారానే కరో నా వైరస్‌ను అడ్డుకోవచ్చని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కామా రెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఐసోలేషన్, ఐసీయూ ఏర్పాట్లను, ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసో లేషన్ వార్డును, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆశా వర్కర్లు కచ్చి తమైన రిపోర్టులు తయారు చేసి అధికారులకు అందించాలని సూచించా రు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారిని హైదరాబాద్ గాంధీకి పంపగా అందులో దాదాపు నెగిటివ్‌గానే వచ్చాయ ని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరిని గుర్తించి వారికి హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారన్నారు. హోం ఐసోలేష న్ కాదని ఇష్టారీతిన బయట తిరిగిన వారిని గుర్తించి క్వారంటైన్ హోంలో పెట్టేందుకు ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండలోని ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిందని, అవి తప్పకుండా ప్రజలు పాటించాలని సూచి ంచారు. ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ వెంకటేష్‌దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ నందాలాల్ పవర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్‌ఎంవో శ్రీనివాస్ ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, డీఎస్పీ శశాంక్‌రెడ్డి, కరోనా వైరస్ నియంత్రణ అధికారి శ్రీనివాస్ ప్రసాద్, ఆసుప త్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.