కరోనాపై అప్రమత్తం!
ABN , First Publish Date - 2020-03-16T09:01:07+05:30 IST
ప్రపం చ వ్యాప్తంగా దినదినం తన ప్రభావంతో ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా వైర స్‌పై ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.
జిల్లాలో మూతబడిన సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, బార్లు
వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
వ్యక్తగత శుభ్రత పాటించాలంటున్న వైద్యఆరోగ్యశాఖ అధికారులు
సామాజిక మద్యమాల్లో అసత్య ప్రచారాలపై కఠిన వైఖరి
కామారెడ్డిటౌన్, మార్చి 15: ప్రపం చ వ్యాప్తంగా దినదినం తన ప్రభావంతో ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా వైర స్‌పై ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. అందు కు తగ్గట్టుగానే జిల్లాలోని సినిమాహల్‌లు, విద్యాసంస్థలు, బార్లు, పార్క్‌లు, ఫంక్షన్ హ ళ్లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 1 వరకు ఎలాంటి సభలు, స మావేశాలు ఏర్పాటు చేయరాదని కరోనా వై రస్‌పై సత్యదూరమైన ప్రచారం చేస్తూ ప్రజ లకు ఆందోళనకు గురి చేసిన వారిపై కఠి నంగా వ్యవహరించేందుకు అధికారులు సి ద్ధం అవ్వడంతో పాటు ప్రజలకు కరోనా వైర స్ వ్యాప్తి, లక్షణాలు, జాగ్రత్తలపై ప్రత్యేక ఏ ర్పాట్లు చేయడంతోపాటు విదేశాల నుంచి వ చ్చిన వారిపై వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది స హాయంతో ప్రత్యేక దృష్టిసారించనున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన నియమ నిబంధ నలకు అనుగుణంగా ఆదివారం జిల్లా వ్యా ప్తంగా పలు సినిమాహల్‌లు, బార్‌లు ముసి వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను సైతం మూసి వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండడంతో అఽధికారులు ఆయా వ సతిగృహలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ యా వ్యాపార కేంద్రాల వద్ద వ్యాపారులు సై తం మాస్క్‌లు ధరించి విక్రయాలు జరుపు తున్నారు.
వైరస్ నియంత్రణకు ముందుస్తు ఏర్పాట్లు
కరోనా వైరస్‌ను అదుపు, నియంత్రణ చే సేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. అందుకు సంబంధించి న లుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిం ది. ప్రజలకు కోవిద్-19పై అవగాహన కల్పిం చడానికి ఆయా మండల కేంద్రాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్య అధికారులకు మార్గద ర్శకాలు జారీ చేశారు. పరిస్థితిని నిత్యం పర్య వేక్షణకు వీలుగా డీయంహెచ్‌వో కార్యాల యంలో ఒక పర్యవేక్షణ గది, సిబ్బందిని ఏ ర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు, బాన్సువాడ ప్రాం తీయ ఆసుపత్రిలో పర్యవేక్షణ గ ది ఏర్పాటు చేయడంతో పాటు అనుమానిత కరోనా వ్య క్తులను తరలించడానికి అంబులెన్స్‌ను సిద్ధం గా ఉంచడం, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిపై నిఘా ఉంచి వారి ఆరోగ్య సమాచా రం సేకరించడానికి ఆశలకు, ఎంపీహెచ్‌ఏ లకు సూచనలు ఇవ్వడం జరిగింది.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
కరోనాపై ప్రజలు అవగాహన కలిగి ఉం డాలని ఆయా ప్రాథమిక కేంద్రాలలో సిబ్బం దిని ఏర్పాటుచేయడంతో పాటు ప్రజలకు అ వగాహన కలిగించేందుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు ముంద స్తు జాగ్రత్తలపై ప్రజలకు వివరించనున్నా రు. జలుబు, ఉపిరిత్తితుల సమస్యలతో బాధ పడుతుండడమే కాకుండా ఉపిరి తీసుకో వ డం కష్టంగా ఉండడం, ఛాతిదగ్గర నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారు లు వివరిస్తున్నారు. వైరస్ బారిన పడినట్లు అనుమానంగా ఉంటే ముందుగా వైద్యుడి ద గ్గరికి వెళ్లి వారిచ్చే సలహలు, సూచనలు పా టించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నోటి లోపల(డ్రై)గా ఉంటే నీరు ఎక్కువగా తాగు తూ ఉండాలి. ఇలా నీరు తాగడం వల్ల సూ క్ష్మ క్రిములు, ఉపిరితిత్తులలోకి వెళ్లకుండా జీ ర్ణాశయంలోకి వెళ్లి అక్కడ స్రవించబడే ఆ మ్లాలతో నశించబడతాయని పేర్కొంటున్నా రు.
సాధ్యమైనంత వరకు కరచాలనం, జలు బు, ప్లూ వంటి లక్షణాలు ఉన్నవారికి దగ్గర గా ఉండకపోవడం, చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకవద్దని, అవస రమైన అపోహలు నమ్మకుండా పెంపుడు జంతువులకు దగ్గరగా ఉండకూడదని అంటు న్నారు. చేతులను సబ్బుతో తరుచుగా కడు క్కోవాలని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు జేబు రు మాలు అడ్డంగా పెట్టుకోవాలని సూచిస్తు న్నారు. కరోన వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుందని ఉతికిన బట్టలు 2 గంటలు ఎండలో ఆరవేయాలని, గోరువెచ్చ ని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పు క్కిలించడం ద్వారా క్రిములను నిర్మూలించి తద్వార కరోనా క్రిములు ఉపిరితిత్తులకు చేరకుండా నివారించవచ్చని వైద్యులు వివ రిస్తున్నారు.