28 ఏళ్ల మహిళకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన రోజే అర్ధరాత్రి సమయంలో..

ABN , First Publish Date - 2020-07-28T19:02:11+05:30 IST

నిజామాబాద్‌ రూరల్‌ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఓ మహిళ(28) కరోనాతో సోకడంతో మృత్యువాతపడింది. రెండు రోజులుగా సాధారణ జ్వరంతో బాధపడుతున్న వివాహిత కు

28 ఏళ్ల మహిళకు కరోనా.. ఆస్పత్రిలో చేరిన రోజే అర్ధరాత్రి సమయంలో..

ఆకుల కొండూరులో కరోనాతో వివాహిత మృతి


నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ రూరల్‌ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఓ మహిళ(28) కరోనాతో  సోకడంతో మృత్యువాతపడింది. రెండు రోజులుగా సాధారణ జ్వరంతో బాధపడుతున్న వివాహిత కు ఆదివారం రాత్రి చాతిలో, గొంతులో నొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. సిటీ స్కాన్‌లో ఆమెకు కరోనా 5శాతం సోకినట్లు వైద్యులు తేల్చారు. దాంతో సదరు వైద్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. దాంతో వారు రాత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు అన్ని పరీక్షలతోపాటు కొవిడ్‌-19 పరీక్ష కూడా చేశారు. కాగా, సదరు మహిళ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో మృతిచెందింది. కరోనా రిపోర్టులో సైతం ఆమెకు పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆకుల కొండూరు గ్రామ స్మశానవాటికకే నేరుగా అంబులెన్స్‌లో తరలించారు. కేవలం కొద్ది నిముషాల్లోనే గ్రామ సర్పంచ్‌ ఎం.అశోక్‌కుమార్‌ సమక్షంలో వైద్య సిబ్బంది, పోలీసులు దహనసంస్కరణలు నిర్వహించారు. మృతురాలి ఇంట్లో మొత్తం 11 మంది నివసిస్తుండగా అధికారులు వారందరినీ హోంక్వా రంటైన్‌లో ఉండాలని సూచించారు సదరు మహిళ కరోనాతో మృతిచెందడంతో అబ్బాపూర్‌లో గ్రామస్థులు ఆందోళనలకు గురవుతున్నారు. 


ఆలూర్‌లో కొవిడ్‌ లక్షణాలతో మృతి

ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో ఒక మహి ళ(46) కొవిడ్‌-19 లక్షణాలతో మృతి చెందినట్టు తెలిసింది. ఈ మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆర్మూర్‌, నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. దీంతో కొవిడ్‌ మృతుల తరహాలో అంత్య క్రియలు నిర్వహించారు. 


కమ్మర్‌పల్లిలో వృద్ధురాలికి కరోనా లక్షణాలు..

కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధు రాలికి అనారోగ్యంతో పాటు కరోనా లక్షణాలు కనిపి ంచడంతో స్థానిక వైద్యసిబ్బంది 108 అంబులెన్స్‌లో జిల్లా జనరల్‌ ఆసుపత్రికి పరీక్షల నిమ్తితం తరలించారు. వృద్ధురాలికి కుటుంబసభ్యులు హైదరాబాద్‌ ఆసు పత్రిలో ఇటీవల పరీక్షలు నిర్వహించి ఇంటికి తీసుకొ చ్చారు. అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా క రోనా అయిఉండొచ్చని అనుమానించారు. 

Updated Date - 2020-07-28T19:02:11+05:30 IST