మరో 71 కేసులు.. నిజామాబాద్ జిల్లాలో కరోనా లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-08-12T18:22:25+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 71 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలం లో కొత్తగా ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలున్నయన్న అనుమానంతో వైద్యపరీక్షలు చేయించుకున్న ఎనిమిది

మరో 71 కేసులు.. నిజామాబాద్ జిల్లాలో కరోనా లెక్కలివీ..!

మరో 71 కరోనా కేసులు నమోదునిజామాబాద్‌(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 71 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలం లో కొత్తగా ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలున్నయన్న అనుమానంతో వైద్యపరీక్షలు చేయించుకున్న ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ మంగళవారం రిపోర్టులు వచ్చినట్లు తెలిపారు. ఆర్యనగర్‌లో40 ఏళ్ల మహిళతోపాటు ఇద్దరు పురుషులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారితోపాటు సారంగపూర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళతోపాటు మాధవనగర్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి, ముబారక్‌నగర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తికి, మల్లారంలో 29 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. వారంతా హోం ఐసొలేషన్‌లో ఉండిచికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 


వర్నిలో ఐదు కరోనా పాజిటివ్‌లు

వర్ని ఉమ్మడి మండలంలో మంగళవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్యాధి కారి డాక్టర్‌ వెంకన్న తెలిపారు. 16 మందికి పరీక్షలు ని ర్వహించగా ఐదుగురు కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. బాధితుల్లో ముగ్గురు చందూరుకు చెందిన సత్యనా రాయణ పురం గ్రామ పంచాయతీ మహిళా కార్మికులు, వకీల్‌ఫారం వ్యక్తి మరొకరు కోటయ్యక్యాంపునకు  చెం దిన యువకుడు ఉన్నట్లు డాక్టర్‌ వెల్లడించారు. 


బోధన్‌లో నాలుగు 

బోధన్‌లో మంగళవారం నాలుగు కరోనా పా జిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. బోధన్‌ ప్రభుత్వ ఆసు పత్రిలో 24 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలు గురికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 


రుద్రూరులో రెండు 

రుద్రూరు మండల కేంద్రంలోని మంగళవారం ముగ్గు రికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు, ఒకరికి నెగిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ దిలీప్‌ తెలిపారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిం చాలని, మాస్క్‌లు తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. 


ఆర్మూర్‌ డివిజన్‌లో 17

ఆర్మూర్‌ డివిజన్‌లో వివిధ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంగళవారం ని ర్వహించిన ర్యాపిడ్‌ టెస్టుల్లో 17మందికి కరో నా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 57మందికి టెస్టులు నిర్వహించా మన్నారు. చేపూర్‌, చాకిర్యాల్‌, మోర్తాడ్‌, పాలెం గ్రామాల్లో ఒక్కోక్కరికి, ఆలూర్‌లో ముగ్గురికి, పె ర్కిట్‌లో ముగ్గురికి, ఆర్మూర్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఇద్దరికి, రాంనగర్‌లో ఒకరికి, రాజారాంనగర్‌లో ఒకరికి, ఆర్మూర్‌లో మరొకరి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపా రు. అలాగే నిజామాబాద్‌ ఆసుపత్రిలో నిర్వహించిన పరీ క్షల్లో వాడి గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు


చాకిర్యాల్‌లో ఒకరికి 

మెండోర మండలంలో చాకిర్యల్‌ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు మెండోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ నయనరెడ్డి తెలిపారు. ఈ సం దర్భంగా మంగళవారం ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలో ఏడుగురికి కరోనా టెస్టులు చే యగా ఆరుగురికి నెగిటివ్‌ రా గా ఒకరికి పాజిటివ్‌ వచ్చిన ట్టు పేర్కొన్నారు.


గడ్కోల్‌ యువకుడికి 

సిరికొండ మండలం ని గడ్కోల్‌ గ్రామంలో ఒక యువకుడికి కరోనా పాజి టివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. గడ్కోల్‌ గ్రామానికి చెందిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా తీసుకురావడానికి వెళ్లిన కుమారుడు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ఇచ్చి వచ్చారు. మంగళవారం పాజిటివ్‌ వచ్చినట్లు సందేశం వచ్చినట్లు తెలియగానే స్థానికంగా ఉండే వైద్య సిబ్బంది తండ్రి కుమారులను పాఠశాలలో హోం క్వారంటైన్‌లో ఉంచారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చొరవ చూపించి పాఠశాలలో ఉండాలని కోరారు. 


ఘన్‌పూర్‌ పెరుగుతున్న కేసులు..

డిచ్‌పల్లి మండలంలోని ఘన్‌పూర్‌ గ్రా మంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజు కు అధిక మవుతుండడంతో గ్రామంలో లాక్‌డౌన్‌ చర్యలు గ్రామ ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు చేపడు తున్నారు. మొన్న ఒకే రోజే గ్రామంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా సోమవారం నాలుగురికి, మంగళవారం సీహెచ్‌సీ ఆస్ప త్రిలో పనిచేసే ల్యాబ్‌ టెక్నిషియన్‌కు కరోనా పాజిటివ్‌గా రావడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత వరకు ఘన్‌పూర్‌లోనే 8మందికి కరోనా సోకడంతో గ్రామస్థులు భయంగుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోకి ఇతర వ్యక్తులను రానివ్వకుం డా రహదారులపై ఎక్కడికక్కడే రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేస్తున్నారు. గ్రామంలోని వ్యాపార సముదా యాలను కూడా ఉదయం సమయం లోనే తెరవాలని, సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రామంలోనే రెండు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలో భయందోళన నెలకొంది. కరోనా వచ్చిన రెండు కుటుంబాలు కూడా జిల్లా కేంద్రంలోనే నివాసముంటున్నారు. కరోనా కట్టడికి అన్ని వర్గాల ప్రజల సహకారం రాజ కీయాలకు అతీతంగా అవసరమని కోరుతున్నారు. 


కరోనాతో ఒకరి మృతి 

నందిపేట మండంలోని నికాల్‌పూర్‌ గ్రామానికి చెందిన అ మ్మకంటి రమేష్‌ (37) అనే వ్యక్తి మంగళవారం కరోనాతో మృతి చెం దాడు. కరోనా సోకిన ఆయన హైద రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కరోనా చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2020-08-12T18:22:25+05:30 IST