కామారెడ్డి జిల్లాలో మరో 40 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-08-11T18:37:52+05:30 IST
జిల్లాలో సోమవారం 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన

కామారెడ్డి టౌన్(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షలలో 40 పాజిటివ్‌లు వచ్చినట్లు తెలిసింది. పిట్లం 1, బిచ్కుంద 2, రాజీవ్‌నగర్ యూపీహెచ్సీ, లింగంపేట 3, పెద్దకోడప్గల్ 1, ఉత్తునూర్ 1, దేవునిపల్లి 17, భిక్కనూర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి 108, బాన్స్వాడ ఆసుపత్రి నుంచి 131 మంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.
లింగంపేట: మండలంలో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సాయికుమార్ తెలిపారు. మెంగారంలో మూడు, లింగంపేటలో ఒకటి నమోదైనట్లు ఆయన తెలిపారు. మండలంలో 15 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భిక్కనూరు, రాజంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో ఏడుగురికి కొవిడ్-19 నిర్ధారణ అయిందని వైద్యాధికారులు రవీందర్, శిరీష్ కుమార్ తెలిపారు. భిక్కనూరులో ఐదుగురికి, కంచర్ల, జంగంపల్ల్లి, లక్ష్మీదే వునిపల్లి గ్రామాలల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. వారం దరిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.