ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-16T10:35:38+05:30 IST

కోవిడ్‌-19 వైరస్‌ కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భా గంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జిల్లాలోని ప్రజలందరు సహకరించాలని కలెక్టర్‌ శరత్‌

ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలి : కలెక్టర్‌

కామారెడ్డిటౌన్‌, మార్చి 31 : కోవిడ్‌-19 వైరస్‌ కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భా గంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జిల్లాలోని ప్రజలందరు సహకరించాలని కలెక్టర్‌ శరత్‌ కోరారు. కరోనా వైరస్‌ ప్రబలకుండ అన్ని విద్యాసంస్థలు, కో చింగ్‌ సెంటర్‌లు, సినిమాహల్స్‌, స్విమింగ్‌ పూల్‌లు మార్చి 31వరకు మూసివేసేందుకు సెలవులు ప్రక టించామన్నారు.


మ్యారేజ్‌ ఫంక్షన్‌ హల్స్‌లు సైతం బంద్‌ చేయాలని ముందస్తుగా బుక్‌ చేసుకున్న వాటికి మినహియింపు ఇవ్వడం జరుగుతుందని తెలి పారు. బహిరంగ సమావేశాలు, సమ్మర్‌క్యాంప్స్‌, క ల్చరల్‌ ఈవెంట్స్‌, స్పోర్ట్స్‌ ఈవెంట్‌, జాతరలు నిషేది ంచబడినవని తెలిపారు. స్పోర్ట్స్‌ స్టేడియం, బార్స్‌, ప బ్స్‌ సైతం మూసివేయాలని తెలిపారు. కరోనా వ్యా ధిపై ఎటువంటి అవాస్తవిక ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. కాగా పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు షెడ్యుల్‌ ప్రకా రం యదావిధిగా నిర్వహించబడుతాయని తెలిపారు.

Updated Date - 2020-03-16T10:35:38+05:30 IST