సెకండ్ వేవ్‌పై నజర్
ABN , First Publish Date - 2020-12-01T05:49:04+05:30 IST
ఇతర రాష్ట్రాలలో సెకండ్ వేవ్ కింద కరోనా కేసుల సం ఖ్య పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం మళ్లీ వైరస్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి పెడుతోంది.
కరోనా సెకండ్ వేవ్‌పై దృష్టి పెట్టిన యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో అప్రమత్తమైన అధికారులు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు
ప్రస్తుతం నిలకడగానే కరోనా కేసులు
నిజామాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇతర రాష్ట్రాలలో సెకండ్ వేవ్ కింద కరోనా కేసుల సం ఖ్య పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం మళ్లీ వైరస్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి పెడుతోంది. ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఉ మ్మడి జిల్లా పరిధిలో మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చిన వారికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ దఫా ఎక్కువ మందికి వచ్చినా చికిత్స అందించే వి ధంగా బెడ్‌లకు ఆక్సిజన్ కనెక్షన్‌లను పెంచారు. కరోనా బ్లా క్‌తో పాటు జనరల్ ఆసుపత్రిలో కూడా సుమారు 580 బె డ్లకు ఆక్సిజన్ కనెక్షన్స్ ఇచ్చారు. మందులు, ఇతర అవసరమైన కిట్లు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. కొ త్తగా 25 ఐసోనాజల్ క్యాండులా మిషన్‌లను తెప్పించారు. వీటి కోసం సుమారు రూ.30 లక్షలకుపైగా నిధులు ఖర్చు చేశారు. ఈ మిషన్‌లను కరోనా వచ్చిన వారి కోసం ఉప యోగిస్తారు. అధునాతనమైన ఈ మిషన్‌లు సీరియస్‌గా ఉన్న వారికి చికిత్స అందించేందుకు ఉపయోగపడుతాయి. కరోనా వచ్చిన వారి కోసం ఆసుపత్రిలో కొత్తగా రూ.10 లక్షలు వెచ్చించి డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను కూడా ఏర్పాటు చే శారు. గతంలో లాగా కాకుండా ఈ మిషన్ ద్వారా వెంటనే సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. డిజిటల్ మిషన్ ద్వారా రోగికి సంబంధించిన ఎక్స్‌రేను తీయడంతో పాటు అ వసరమైన చికిత్స అందించే అవకాశం ఏర్పడింది. వీటితో పాటు ఆసుపత్రిలో మొత్తం 75 వెంటిలేటర్‌లను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో అత్యవసరం కావడంతో వీటిని ఆసుపత్రుల్లో అమర్చారు. సెకండ్ వేవ్‌లో ఒకవేళ ఉమ్మడి జిల్లా పరిధిలో కేసుల సంఖ్య పెరిగితే వీటిని ఉపయోగించేందుకు ముందస్తుగానే ఈ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చలితో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం పదుల సంఖ్యలోనే కేసులు
ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత మేర తగ్గింది. రెండు జిల్లాల పరిధిలో ప్రతీరోజు పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. గతంలో ప్రతీరోజు ఉమ్మడి జిల్లా పరిధిలో 200 నుంచి 400కు మధ్య కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 20 నుంచి 40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఇళ్ల లోనే చికిత్స పొందుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ని జామాబాద్ జనరల్ ఆసుపత్రిలో చేరుతున్నారు. గతంతో పోలిస్తే కేసులు తగ్గడం వల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో 50 మందిలోపే చికిత్స పొందుతున్నారు. గతంలో నిజామాబా ద్ ఆసుపత్రిలో 200 మందికిపైగా చికిత్స పొందారు. ప్రస్తు తం ఉమ్మడి జిల్లా పరిఽధిలో కేసులు తగ్గడం వల్ల చేరే వారి సంఖ్య తగ్గింది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ల నుంచి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారు చికిత్స కోసం వచ్చి చేరుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కరోనా చికిత్సలో నిజామాబాద్ ఆసుపత్రి మెరుగ్గా ఉండడంతో ఎక్కువ మంది ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. గడిచిన నెల రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో కరోనా తీవ్రత తగ్గడం వల్ల పీహెచ్‌సీల పరిధిలో పరీక్షల సంఖ్య కూడా తగ్గాయి. కొన్ని పీహెచ్‌సీల పరిధిలో పరీక్షల ను కూడా చేయడం లేదు. ఎవరైనా కరోనా లక్షణాలతో వస్తే తప్పా నేరుగా పరీక్షలు నిర్వహించడం లేదు. కొన్ని చోట్ల మొబైల్ వ్యాన్‌ల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 26,500కు పైగా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ ఆసుపత్రిలో మాత్రం ప్రతీరోజు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో కూడా పాజిటివ్ కేసులు తక్కువ గానే వస్తున్నాయి.
ముందస్తు ఏర్పాట్లు చేశాం..
డాక్టర్ ప్రతిమారాజ్, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఉమ్మడి జిల్లా పరిధిలో సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం ఆసుపత్రిలో 50 మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఉమ్మడి జిల్లా తో పాటు ఇతర జిల్లాల వారు ఉన్నారు. కేసుల సంఖ్య పెరిగినా ఆసుపత్రిలో చికిత్స అందించే విధంగా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.