టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌

ABN , First Publish Date - 2020-10-07T10:56:59+05:30 IST

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 38వ వార్డుకు చెం దిన కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చాట్ల రాజేశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీకి

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 6: కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 38వ వార్డుకు చెం దిన కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చాట్ల రాజేశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, లోయపల్లి నర్సింగ్‌రావు, చంద్ర శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు.


లింగంపేటలో మరో ఎంపీటీసీ..

లింగంపేట:మండలంలోని భవానీపేట ఎంపీటీసీ ఇండిపెండెంట్‌గా గెలుపొందిన ఆకుల సురేందర్‌ మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ మొత్తం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరాయి. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితకు మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సమక్షంలో క్యాంపులో ఉన్నారు. 

Read more