రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-16T05:15:39+05:30 IST
మండలంలోని కాచాపూర్ గ్రామ శివారులో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారు.

భిక్కనూరు, డిసెంబరు 25: మండలంలోని కాచాపూర్ గ్రామ శివారులో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం గూడెం నుంచి ట్రా లీ వాహనంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పక్కా సమా చారం మేరకు కాచాపూర్ శివారులో పట్టుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సవిల్ సప్లై డీటీ రంజిత్‌కుమార్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు.