డిజిటల్‌ ఇండియా అవార్డు అందుకున్న కామారెడ్డి కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-31T04:20:15+05:30 IST

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన డిజిటల్‌ ఇండి యా 2020 అవార్డు ప్రదానో త్సవ కార్యక్రమాన్ని బుధ వారం వీడియో కాన్ఫరె న్స్‌ ద్వారా నిర్వహించారు.

డిజిటల్‌ ఇండియా అవార్డు అందుకున్న కామారెడ్డి కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ను అభినందిస్తున్న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

దేశంలో ఎంపికైన మూడు జిల్లాలు  ఫ ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన డిజిటల్‌ ఇండి యా 2020 అవార్డు ప్రదానో త్సవ కార్యక్రమాన్ని బుధ వారం వీడియో కాన్ఫరె న్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రాంనాఽథ్‌కోవింద్‌ హాజరయ్యారు. డిజిటల్‌ ఇండియా- 2020 అవార్డు పలు కేటగిరీల్లో కేంద్రప్రభుత్వం అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ డిస్ట్రిక్‌ కేటగిరీలో సిల్వర్‌ అవా ర్డుకు దేశంలోనే మూడు జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో కామారెడ్డి జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా ఉండగా రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్‌, మూడో స్థానంలో తెలం గాణలోని కామారెడ్డి జిల్లా ఎంపికైంది. ఈ అవార్డు ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అందజేశారు. కలెక్ట ర్‌తో పాటు జిల్లా ఇన్ఫర్మేటిక్‌ ఆఫీసర్‌ బండి రవి ఉన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ, కమ్యూనికేషన్‌, ఎలకా్ట్రనిక్‌ ఇన్ఫర్‌మే షన్‌ టెక్నాలజీశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి సంజయ్‌దోత్రే, కేంద్ర ఎలకా్ట్రనిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీశాఖ సెక్రెటరీ
అజయ్‌సాహిని పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:20:15+05:30 IST